ఎవరు ఏం అనుకున్నా బీజేపీ పార్టీ హిందుత్వానికి మద్దతు ఇచ్చే పార్టీ అనే సంగతి బహిరంగంగా అందరికీ తెలుసు. ఏపీ విషయాల్లో కొంత సైలెంట్ గానే ఉండే బీజేపీ అంతర్వేది రథం ఘటన విషయంలో మాత్రం సీరియస్ గా వ్యవహరించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పై ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశారు.
Also Read: బిజెపి-జనసేన మూడో ప్రత్యామ్నాయం కావాలంటే?
ఇళ్లల్లో కూర్చుని నిరసన దీక్షలు చేపట్టి అధికార పార్టీ వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేశారు. జగన్ సర్కార్ నచ్చజెప్పటానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే బీజేపీ నేతలు తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే చందాన విమర్శల పర్వం కొనసాగించారు. మరోవైపు రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఘటనల విషయంలో కుట్ర కోణం దాగుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
జగన్ సర్కార్ ను ఇబ్బందులు పెట్టాలనే ఆలోచనతో కొందరు కావాలనే ఈ తరహా కుట్ర కోణాలకు తెర లేపుతున్నారని ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే తాజాగా జగన్ సర్కార్ అంతర్వేది ఘటన విచారణను సీబీఐకి అప్పగించింది. దీంతో బీజేపీకి జగన్ సర్కార్ పై అంతర్వేది ఘటన విషయంలో విమర్శలు చేసే హక్కు లేకుండా పోయింది. ఇక ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారో బీజేపీ నేతలే తేల్చాల్సి ఉంది.
Also Read: బీజేపీ బండి సంజయ్ ముందున్న సవాళ్లు ఇవే..
ఈ ఘటన విషయంలో బీజేపీ చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందో లేదో చూడాల్సి ఉంది. రాష్ట్ర పోలీసులపై కూడా ప్రత్యర్థి పార్టీల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర విచారణ సంస్థకే అంతర్వేది కేసును జగన్ సర్కార్ అప్పగించడంతో హిందూ ద్రోహులను ఎన్ని రోజుల్లో సీబీఐ పట్టుకుంటుందో చుడాల్సి ఉంది.