
సినీ ఇండస్ట్రీకి మూడేళ్లపాటు దూరంగా ఉన్న పవన్ ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన లెటేస్ట్ మూవీపై హాట్ టాపిక్ నడుస్తోంది. మలయాళం మూవీ ‘అయ్యప్పన్ కోశీయమ్’ అనే సినిమా రీమేక్ లో పవన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బీజూ మీనన్ పాత్రలో పవన్ కల్యాణ్, పృథ్వీరాజ్ పాత్రలో రానా నటించబోతున్నారు. అయితే సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ పై తీవ్రంగా చర్చ సాగుతోంది.
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వస్తున్న ఈ మూవీకి సాగర్ కె.చంద్ర డైరెక్షన్ చేస్తున్నారు. అయితే సినిమా టైటిల్ పై రకరకాల ప్రపోజల్స్ ఉన్నాయి. ముందుగా దీనికి ‘బిల్లా రంగా’ అని పేరు పెట్టాలనుకున్నారు. కానీ ఆ తరువాత కుదరదని వదిలేశారు. దీంతో ‘పరుశురామ కృష్ణమూర్తి’ అనే టైటిల్ పై చర్చిస్తున్నారు. సినిమాలో ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో నేమ్స్ టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారట. అయితే అఫీషియల్ గా మాత్రం అనౌన్స్ చేయలేదు.
‘అయ్యప్పన్ కోశీయమ్’ రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా సినిమాను నిర్మించాలనుకుంటున్నారట. ప్రస్తుతం పవన్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ తో బీజీగా ఉన్నారు. ఆ సినిమా షెడ్యూల్ పూర్తవగానే నెక్స్ట్ ఈ సినిమా కోసం పనిచేయనున్నారు. ఇక ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించనున్నారు. డైలాగ్స్, పర్యవేక్షణ త్రివిక్రమ్ సారధ్యంలో సాగనుంది.
దాదాపు 40 శాతం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది. ఈనెల 11న తిరిగి సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. కాగా ఈ సినిమాకు నేషనల్ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. అయితే సినిమా పూర్తయ్యే వరకు #pspkrana ట్యాగ్ తో ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు.