
జల వివాదాలపై రెండు తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకోవాలని ఏపీ ఫ్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో అన్నీ చేస్తామని తెలిపారు. ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం అని స్పష్టం చేశారు. జల వివాదంపై ఇప్పటికే అందరికీ లేఖలు రాశామని చెప్పారు. కేంద్రం కూడా మధ్యవర్తత్వం వహిస్తోందన్నారు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాం అని వివరించారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతామన్నారు. రెచ్చగొడితే రెచ్చిపోమని సజ్జల తెలిపారు.