Mahesh Babu – Chiranjeevi : మహేష్ బాబు బాలనటుడిగా నటించిన ఏకైక చిరంజీవి సినిమా అదేనా..? ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయం!

ఇకపోతే ప్రస్తుతం వీళ్లిద్దరు ఇండస్ట్రీ లో ఏ స్థానంలో కొనసాగుతున్నారో మన అందరికీ తెలిసిందే. 70 ఏళ్ళ వయస్సులో కూడా చిరంజీవి రికార్డ్స్ సృష్టిస్తుంటే, మహేష్ బాబు వరుసగా హిట్టు మీద హిట్ కొడుతూ తన తోటి హీరోలకు మంచి పోటీ ఇస్తున్నాడు.

Written By: Vicky, Updated On : August 24, 2024 9:51 pm

Chiranjeevi movie in which Mahesh Babu acted as a child actor

Follow us on

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు బాలనటుడిగా ఉన్నప్పుడే స్టార్ గా ఒక వెలుగు వెలిగాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. చిన్నతనంలోనే ఆయన తన సినిమాల్లో ఫైట్స్, డ్యాన్స్ చేసేవాడు. అప్పట్లో మహేష్ బాబు బొద్దుగా ఉండేవాడు. ఇంత లావుగా ఉంటూ కూడా ఈ రేంజ్ ఫైట్స్, డ్యాన్స్ ఎలా చేసేవాడు అని అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయేవారు. భవిష్యత్తులో మహేష్ బాబు హీరో గా ఎంట్రీ ఇస్తే, తండ్రిని మించిన సూపర్ స్టార్ అవుతాడు అని అప్పట్లో అందరూ అనుకునేవారు. వాళ్లంతా అనుకున్నట్టుగానే మహేష్ బాబు ఇప్పుడు సూపర్ స్టార్ గా టాలీవుడ్ లో ఒక వెలుగు వెలుగుతున్నాడు.

అయితే మహేష్ బాలనటుడిగా నటించిన చిత్రాలలో ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘బాలకృష్ణుడు’ వంటివి కమర్షియల్ గా సూపర్ హిట్స్ గా నిలిచాయి. వీటిల్లో కొడుకు దిద్దిన కాపురం చిత్రం గురించి ఇప్పుడు మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేసాడు. ఆయనకి తల్లిదండ్రులుగా సూపర్ స్టార్ కృష్ణ, విజయశాంతి నటించారు. ఈ చిత్రానికి దర్శకుడు కూడా కృష్ణ నే. అయితే ఈ చిత్రాన్ని తొలుత మెగాస్టార్ చిరంజీవి తో తియ్యాలని అనుకున్నాడు కృష్ణ. ఆయనని హీరో గా పెట్టి, మహేష్ ని ఆయనకి కొడుకుగా చూపిస్తే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఫలితం ఉంటుందని ఆయన అనుకున్నాడు. అప్పట్లో కృష్ణ ఏమి అడిగినా చేసేవాడు చిరంజీవి. చిరంజీవి శకం మొదలైన కొత్త రోజులవి. తన కొడుకుతో చిరంజీవి కలిసి పని చేస్తే మహేష్ బాబు కి మంచి రీచ్ ఉంటుందని కృష్ణ ఉద్దేశ్యం. అయితే అప్పట్లో చిరంజీవి ఒకేసారి నాలుగైదు సినిమాల షూటింగ్స్ చేసేవాడు, ఆయన డేట్స్ దొరకడం చాలా కష్టం గా ఉండేది. కృష్ణ స్వయంగా అడగడంతో డేట్స్ సర్దుబాటు చెయ్యడానికి చిరంజీవి చాలా కష్టపడ్డాడు కానీ, అది కుదర్లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆయన చెయ్యలేకపోయాడు.

కృష్ణ కూడా చిరంజీవి పరిస్థితిని అర్థం చేసుకొని ఎక్కువగా ఒత్తిడి చెయ్యలేదు. ఇక చివరికి తానే దర్శకత్వం వహిస్తూ, తానే హీరో గా ఈ సినిమా చేసాడు. ఫలితం అదిరిపోయింది. అప్పట్లో అత్యధిక సెంటర్స్ లో వంద రోజులు పూర్తి చేసుకోవడమే కాకుండా, ఓపెనింగ్ రికార్డులు, మొదటి వారం రికార్డులు కూడా ఈ చిత్రానికి వచ్చాయి. అలా చిరంజీవి మహేష్ బాబు కాంబినేషన్ లో ఈ సినిమా మిస్ అయ్యింది. రీసెంట్ గా కూడా వీళ్ళ కాంబినేషన్ లో ఆచార్య చిత్రం రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల రామ్ చరణ్ మహేష్ బాబు స్థానంలో నటించాడు. ఇకపోతే ప్రస్తుతం వీళ్లిద్దరు ఇండస్ట్రీ లో ఏ స్థానంలో కొనసాగుతున్నారో మన అందరికీ తెలిసిందే. 70 ఏళ్ళ వయస్సులో కూడా చిరంజీవి రికార్డ్స్ సృష్టిస్తుంటే, మహేష్ బాబు వరుసగా హిట్టు మీద హిట్ కొడుతూ తన తోటి హీరోలకు మంచి పోటీ ఇస్తున్నాడు.