Hand surgery : వైద్యశాస్త్రంలో ఇదో అద్భుతం.. ముక్కలైన చేతిని అతికించిన వైద్యులు..

కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లాల్లో అద్భుతం జరిగింది. సామిల్ లో పని చేసే ఒక కూలీ చేయి ప్రమాదవశాత్తు రెండు భాగాలుగా విడిపోవడంతో సదరు కూలీ చేతిని పట్టుకొని సర్గి హాస్పిటల్ లో చేరాడు. విడిపోయిన భాగం బాగుండడంతో వైద్య బృందం 7 గంటలు కష్టపడి అతికించారు.

Written By: NARESH, Updated On : August 24, 2024 9:40 pm

Hand Surger

Follow us on

Hand surgery : వైద్యశాస్త్రం మరింత వేగంగా అభివృద్ధి చెందింది. చాలా వ్యాధులను మందులు, టీకాలతో నయం చేస్తుంటే విరిగిపోయిన అవయవాలను కూడా వైద్యులు ఆపరేషన్ చేసి చక్కగా అతికిస్తున్నారు. మనిషి శరీరంలోని ఏదైనా భాగం ప్రమాదవశాత్తు రెండుగా విడిపోతే శరీరానికి అనుబంధంగా ఉన్నదానికి మాత్రమే శస్త్ర చికిత్స చేసేవారు. కానీ రాను రాను వేరుపడిన భాగాలను కూడా అతికించి రెండు భాగాలు పని చేసేట్లుగా చేయిస్తున్నారు. ఇది పేషంట్ కు మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. వైద్య రంగం అభివృద్ధి చెందిన తర్వాత ఇలాంటి ఆపరేషన్లు లెక్కకు మించి జరుగుతూనే ఉన్నాయి. కానీ దీనికి వైద్యులు ఎక్కువ శ్రమపడాల్సి ఉంటుంది. గంటల కొద్దీ ఆయా విభాగాలకు సంబంధించి వైద్యులు శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది. శరీరం నుంచి వేరైన భాగం శాస్త్ర చికిత్సకు స్పందిస్తుందా? లేదా? అనేది సరిచూసుకున్నాక ఆపరేషన్ మొదలు పెడతారు. ఇలాంటి ఒక ఘటన కర్ణాటకలో జరిగింది. సర్గి ఆసుపత్రి వైద్యులు ప్రత్యేకమైన ఆపరేషన్‌ నిర్వహించి తెగిపోయిన రెండు చేతి భాగాలను అతికించారు. రెండు ముక్కలుగా విడిపోయిన చేతిని మళ్లీ అతికించడంలో సర్జికల్ సూపర్ స్పెషాలిటీ వైద్యుల బృందం విజయం సాధించింది .

ఏం జరిగింది..?
కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలోని సామిల్‌లో పనిచేస్తున్న 35 ఏళ్ల కూలీ ప్రమాదవశాత్తు కలప కోసే యంత్రానికి చేయి తగిలి రెండు ముక్కలుగా తెగిపోయింది. చేతి మణికట్టు వరకు ఒక భాగం, పైన మరో భాగంగా వేరయ్యాయి. విరిగిన భాగాన్ని ఐస్ బాక్స్‌లో ఉంచి రోగిని ఆసుపత్రి క్యాజువాలిటీ విభాగంలో చేర్చారు. ఇందుకు సంబంధించి వెంటనే బిజీబిజీగా ఉన్న వైద్యుల బృందం ఆస్పత్రిలో 7 గంటల పాటు నిరంతరాయంగా శస్త్ర చికిత్స చేశారు. ముంజేయి కండరం, ఎముక, నరాలు విజయవంతంగా తిరిగి జోడించి ఆపరేషన్ జయప్రదం చేశారు. రోగిని బాగా చూసుకొని వారం తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత చెకప్ లకు వస్తున్న రోగి చేయి గతంలో లాగా పని చేస్తుంది. పైగా ఆ గాయం నుంచి ఆయన కోలుకుంటున్నాడు.

సర్గి హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ చేతన్, ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ మంజునాథ్, మెడికల్ సూపరింటెండెంట్, అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ వాదిరాజ కులకర్ణి, డాక్టర్ మూర్కనప్ప, డాక్టర్ సంతోష్, డా. అర్జున్ బృందం ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది.

ఎలా సాధ్యమైందంటే..
ప్రమాదంలో ఏదైనా అవయవం తెగిపోతే బాధితుడు, లేదంటే స్థానికులు తెగిపోయిన భాగాన్ని భద్రపరచాలి. రోగితో పాటు హాస్పిటల్ కు తీసుకురావాలి. హాస్పిటల్ లో ప్రత్యేకమైన పరికరంలో తెగిన భాగాన్ని భద్రపరుస్తారు. దీని వలన అందులోని కణజాలం, కణాలు చనిపోకుండా ఉంటాయి. ఆ తర్వాత ఆపరేషన్ చేసే సమయంలో రెండు భాగాలను కలిపాలి. కొన్ని రోజుల తర్వాత రెండు బాగాలు కలిసిపోయి కొత్త చర్మం పుట్టుకచ్చి అతుక్కుంటుందని వైద్యులు తెలిపారు. తెగిన భాగంలోని కణజాలం కూడా స్పందిస్తుందని వివరించారు. తెగిన భాగాన్ని ఆరు గంటల్లోగా హాస్పిటల్ కు తీసుకురావాలి. లేదంటే అది పనికిరాకుండా పోవచ్చు.

ఘటన జరిగినప్పుడు భయంతో తెగిపోయిన భాగాన్ని తీసుకురాకుండానే హాస్పిటల్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదా చాలా ఆలస్యం అయితే, తెగిపోయిన భాగంలోని కణజాలాలు కుళ్లిపోతాయి, కణాలు చనిపోతాయి, కాబట్టి ఆపరేషన్ విజయవంతం కాదు. కానీ ఈ సంఘటనలో, రోగి మేల్కొని, కత్తిరించిన చేతితో సమయానికి వచ్చాడు, కాబట్టి 7 గంటల శస్త్రచికిత్స తర్వాత దీనిని తిరిగి జోడించడం సాధ్యమైంది.

ఏ కారణం చేతనైనా కట్లను నేరుగా నీటిలో లేదా ఐస్ బాక్స్‌లో వేయకూడదు. బదులుగా వాటిని ప్లాస్టిక్ కవర్ లో వేసి ఐస్ బాక్స్ లో తీసుకురావాలి, దీని ద్వారా కణాలు చనిపోవు, శస్త్రచికిత్స హాస్పిటల్ లో అవయవాలను తిరిగి అమర్చే సౌకర్యం, అత్యాధునిక శస్త్రచికిత్స యూనిట్ ఉంటుంది.