
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దిగ్గజ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘ఆచార్య’. దేవాదాయ శాఖలోని అక్రమాలపై సంధించిన ఈ సినిమా విడుదల కరోనా కల్లోలంతో బ్రేక్ పడింది.
కరోనా సెకండ్ వేవ్ దేశంలో రావడం.. వేల కేసులు నమోదవుతున్న దృష్ట్యా ప్రభుత్వాలు మళ్లీ ఆంక్షలు విధించాయి. దీంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది.
మొదటి ‘ఆచార్య’ మూవీని మే 14న రిలీజ్ చేయాలని చిత్రం యూనిట్ ప్రకటించింది. అయితే ఈ మధ్య కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. విలన్ గా నటిస్తున్న సోనూ సూద్ సైతం కరోనా బారినపడ్డారు. దీంతో సినిమా షూటింగ్ వాయిదా వేశారు.
తాజాగా ఈ సినిమాను చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జూలై మధ్యలోనే విడుదల చేస్తారని కూడా తెలుస్తోంది.
మొత్తం మీద ఆచార్య మూవీ విడుదల కరోనా వేవ్ తగ్గడం మీదనే ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
కొణిదెల ప్రొడక్షన్.. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లలో నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను మేలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసినా ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.