https://oktelugu.com/

Allu Arjun And Rajamouli: అల్లు అర్జున్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాకపోవడానికి ముఖ్య కారణం ఇదేనా..?

తెలుగులో చాలా మంది డైరెక్టర్స్ ఉన్నప్పటికి రాజమౌళి కి ఉన్న క్రేజ్ ముందు ఏ దర్శకుడు నిలబడలేడనేది వాస్తవం...ఇక ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ గా నిలవడమే దానికి మూల కారణం గా చెప్పుకోవచ్చు...

Written By:
  • Gopi
  • , Updated On : September 19, 2024 / 10:14 AM IST

    Allu Arjun And Rajamouli

    Follow us on

    Allu Arjun And Rajamouli: స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన దర్శకుడు రాజమౌళి…ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేసే వరకు ఆయన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. దీన్నిబట్టి సినిమా మీద ఆయనకున్న డెడికేషన్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక సినిమాని మించి మరొక సినిమాతో భారీ సక్సెస్ లను అందుకున్న ఏకైక దర్శకుడి గా కూడా రాజమౌళి చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలను చేసి మంచి విజయాలను అందుకున్నాడు. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో లతో మాత్రం సినిమాలు చేసే అవకాశం ఆయనకి ఇప్పటివరకు రాలేదు. ఇక మొత్తానికైతే ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. ఇక మహేష్ బాబు తో కూడా ఆయన సినిమాని కంప్లీట్ చేస్తే ఇక పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ లు మాత్రమే బ్యాలెన్స్ ఉంటారు.

    ఇక ఇప్పటివరకు ఆయన వీళ్లతో సినిమా అయితే చేయలేదు. రాజమౌళి కెరియర్ మొదట్లో పవన్ కళ్యాణ్ తో సినిమా ప్లాన్ చేసినప్పటికీ అది వర్కౌట్ కాలేదు. మరి అల్లు అర్జున్ తో రాజమౌళి ఎందుకు సినిమా చేయడం లేదు అనే డౌట్ ప్రతి ఒక్కరు లో ఉంది. నిజానికి రాజమౌళి అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి విపరీతంగా ప్రయత్నం చేసినప్పటికీ, వీళ్ళ మధ్య కాంబినేషన్ అనేది సెట్ కావడం లేదు. ఇక రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.

    నిజానికి బాహుబలి సినిమా తర్వాత అల్లు అర్జున్ తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అజిత్ ని పెట్టి ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేయాలని రాజమౌళి అనుకున్నాడు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇక దాంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ లను పెట్టి ‘త్రిబుల్ ఆర్’ సినిమా చేశాడు. ఆ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా రాజమౌళికి పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తీసుకొచ్చింది.

    ఇక ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా వైడ్ గా విస్తరించాలని ప్రయత్నంలో రాజమౌళి ఉన్నాడు. మరి ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధిస్తాడా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాడా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు…