https://oktelugu.com/

Ram Charan And Buchibabu: రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో లో వస్తున్న సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ చేయబోయే పాత్ర ఏంటంటే..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన సినిమాలు ప్రేక్షకుల్లో చాలా మంచి క్రేజ్ ను అయితే సంపాదించుకుంటాయి. నిజానికి ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ అయితే ఉంటంది...

Written By: , Updated On : September 19, 2024 / 10:06 AM IST
Buchibabu And Ram Charan

Buchibabu And Ram Charan

Follow us on

Ram Charan And Buchibabu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న వాళ్లలో రామ్ చరణ్ ఒకరు. ప్రస్తుతం ఈయన శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన బుచ్చిబాబు తో చేయబోయే సినిమా మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో టాప్ ఆర్టిస్టులు నటించబోతున్నారు అంటూ బుచ్చిబాబు ప్రకటించాడు. ఇక అందులో భాగంగానే కన్నడ స్టార్ హీరో అయిన శివరాజ్ కుమార్ కూడా ఇందులో ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడనే విషయాన్ని అయితే బుచ్చిబాబు అఫీషియల్ గా తెలియజేశాడు. ఇక మొత్తానికైతే వీళ్ళ కాంబోలో వస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక శివరాజ్ కుమార్ ఈ సినిమాలో నటిస్తే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుంది. అలాగే తెలుగులో రామ్ చరణ్ కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు. ఇక బాలీవుడ్ లో సైతం చాలామంది అభిమానులను సంపాదించుకున్న హీరోగా కూడా రామ్ చరణ్ ఒక గొప్ప ఘన కీర్తిని కూడా సంపాదించుకున్నాడు. అలాంటి రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాతో సక్సెస్ సాధించాలని దానిమీద విపరీతమైన కసరత్తులను చేస్తున్నాడు.

ఇక దాంతో పాటుగా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మీద కూడా భారీ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుందనే విషయాన్ని కూడా బయటికి తెలియజేస్తున్నాడు. మరి దానికోసం రామ్ చరణ్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇదిలా ఉంటే శివరాజ్ కుమార్ కాంబో లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా మీద అంచనాలైతే భారీ గా పెరిగిపోతున్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే శివరాజ్ కుమార్ ఈ సినిమాలో రామ్ చరణ్ బ్రదర్ గా నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలు తెలియదు. కానీ శివ రాజ్ కుమార్ ఆ పాత్రలో పవర్ ఫుల్ నటనను చూపించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.

ఇక శివరాజ్ కుమార్ పేరు చెబితే కన్నడ ఇండస్ట్రీ మొత్తం ఉంగిపోతుందనే విషయం మనకు తెలిసిందే. ఇక అక్కడ ఆయనను ముద్దుగా శివన్న అని పిలుచుకుంటూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తి మన సినిమాలో నటిస్తున్నాడంటే సినిమా లో ఆయన క్యారెక్టర్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి…