Prabhas Prashanth Varma Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే లభిస్తోంది. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడు హనుమాన్ లాంటి సినిమా చేసి భారీ విజయాన్ని సాధించాడు. ఆయన సాధించిన విజయంతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో తన పేరు మారుమ్రోగిపోయింది. బాలయ్య బాబు సైతం తన కొడుకు అయిన మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను సైతం ప్రశాంత్ వర్మకే అప్పచెప్పాడు. కానీ ప్రశాంత్ వర్మ మాత్రం దానిని పెద్దగా పట్టించుకోకుండా లైట్ తీసుకున్నాడు. దాంతో బాలయ్య తన కొడుకును పరిచయం చేసే బాధ్యతను మరొక దర్శకుడి చేతిలో పెట్టబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి.
మరి ఇలాంటి సందర్భంలోనే ప్రశాంత్ వర్మ రీసెంట్ గా ప్రభాస్ కి ఒక కథను వినిపించినట్టుగా ఒక వార్త అయితే ప్రచారంలోకి వచ్చింది. ఇక ‘బ్రహ్మ రాక్షసుడు’ అనే టైటిల్ తో ఆ సినిమా ఉండబోతుందంటూ ప్రభాస్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటు కొన్ని వార్తలైతే వచ్చాయి. నిజానికి ప్రభాస్ ప్రస్తుతం భారీ లైనప్ తో ఉన్నాడు. దాదాపు నాలుగు సంవత్సరాల వరకు ఆయన డేట్స్ అయితే ఖాళీగా లేవు.
ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాని కంప్లీట్ చేసి ప్రభాస్ తో సినిమా చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి ప్రభాస్ కనక ప్రశాంత్ వర్మ కి అవకాశం ఇచ్చినట్టైతే ప్రభాస్ కి చాలావరకు మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ కొంతమంది అతన్ని హెచ్చరిస్తున్నారు. కారణం ఏంటి అంటే ప్రశాంత్ వర్మ ఒకదానిమీద నిలకడగా ఉండలేడని ఒకసారి అనుకున్న సబ్జెక్ట్ ని ఏ హీరో తో చేస్తాడు అనేది తనకే క్లారిటీ లేదని హీరోల మీద హీరోలను మారుస్తూ ఉంటాడని చెబుతుంటారు.
ఇక ఆయనతో సినిమా చేయడం వల్ల ప్రభాస్ కి కొంతవరకు మైనస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయని చాలామంది ప్రభాస్ ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రశాంత్ వర్మ చేసిన హనుమాన్ సినిమాను మినహాయిస్తే ఆయనకి పెద్దగా సక్సెసు లైతే లేవనీ విషయక్ చాలా స్పష్టంగా తెలుస్తోంది. తన తదుపరి సినిమాలతో కూడా భారీ సక్సెస్ ని సాధించి ప్రశాంత్ మరోసారి తనను తాను ఎలివేట్ చేసుకున్నట్లయితే ప్రభాస్ సినిమా కన్ఫామ్ గా ఉంటుందని లేకపోతే మాత్రం ఈ సినిమా సెట్స్ మీదకి రావడం చాలా కష్టమని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉండడం విశేషం…