Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనే రేంజ్ రన్ ని దక్కించుకుంటూ ముందుకెళ్తుంది..పక్కనే మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఉండడం, ఆ సినిమాకి కలెక్షన్స్ విపరీతంగా రావడం తో ‘వీర సింహా రెడ్డి’ పై బాగా ఎఫెక్ట్ పడింది..లేకపోతే ఇంకా మంచి వసూళ్లు వచ్చి ఉండేవని ట్రేడ్ వర్గాల అభిప్రాయం..చాలా చోట్ల ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి టికెట్స్ దొరకక ‘వీర సింహా రెడ్డి’ సినిమాకి పోయినవాళ్ళే ఎక్కువ.

సినిమా లో ఎంటర్టైన్మెంట్ లేకపోవడం, ఎక్కువగా హింస కి సింహభాగం ఇవ్వడం వల్లే ఆడియన్స్ పెద్దగా ఈ చిత్రంపై ఆసక్తి చూపించలేదని..ఎంటెర్టైమెంట్ మరియు మాస్ మసాలా జానర్ లో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ కే జనాలు ఎక్కువ మొగ్గు చూపించారు..కానీ ఈ పండగ సెలవలులను ‘వీర సింహా రెడ్డి’ చిత్రం బాగానే ఉపయోగించుకుంది.
మొదటిరోజు బంపర్ ఓపెనింగ్ దక్కించుకున్న ఈ చిత్రానికి 5 రోజులకు కలిపి దాదాపుగా 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..బాలయ్య సినిమాకి ఈ రేంజ్ వసూళ్లు అంటే మామూలు విషయం కాదు..నిన్న కూడా ఈ సినిమాకి నైజాం ప్రాంతం మినహా మిగిలిన ప్రాంతాలలో డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చాయి..నేడు కూడా ఈ సినిమాకి పలు ప్రాంతాలలో డీసెంట్ కలెక్షన్స్ వస్తాయి.

కానీ ఇదే ‘వీర సింహా రెడ్డి’ చిత్రానికి చివరి మంచి రోజని ట్రేడ్ పండితులు చెప్తున్నారు..రేపటి నుండి ఈ సినిమాకి కనీస స్థాయి వసూళ్లు కూడా రావడం కష్టమేనని..ఈ వీకెండ్ తర్వాత సినిమా క్లోసింగ్ కి వచ్చేస్తుందని చెప్తున్నారు..ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 76 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టాలి..ఆ స్థాయికి చేరుకోవాలంటే ఈ వీకెండ్ లొనే ఈ చిత్రం బాగా వసూళ్లను రాబట్టాలి..మరి చివరికి బ్రేక్ ఈవెన్ అందుకుంటుందా లేదా అనేది చూడాలి.