Pawan Kalyan- Veera Simha Reddy: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నందమూరి బాలకృష్ణ కి మధ్య అంతటి సాన్నిహిత్యం ఉందని పవన్ కళ్యాణ్ ‘అన్ స్టాపబుల్’ షో కి వచ్చేంత వరకు ఎవరికీ తెలియదు..రాజకీయ పరంగా వీళ్లిద్దరు గతంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి..అలాంటి వీళ్లిద్దరు ఒక టాక్ షో లో కూర్చొని సరదాగా చిట్ చాట్ చేసుకోవడం అనేది అభిమానులకు మరియు ప్రేక్షకులకు కనులపండుగే అని చెప్పొచ్చు.

బాలయ్యే స్వయంగా పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి టాక్ షో కి రావాల్సిందిగా కోరాడట..బాలయ్య స్థాయి వ్యక్తి పిలిచేలోపు ఎప్పుడూ కూడా కెరీర్ లో ఒక్క టాక్ షో లో కూడా పాల్గొనని పవన్ కళ్యాణ్ ఈ షో లో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు..షూటింగ్ అయిపోయి మూడు వారాలు అయ్యింది..ఈమధ్యనే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన చిన్న గ్లిమ్స్ వీడియో ని విడుదల చేసారు..జనవరి 26 వ తేదీన ఈ ఎపిసోడ్ ఆహా మీడియా లో టెలికాస్ట్ కాబోతుంది.
ఇది ఇలా ఉండగా బాలయ్య హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘వీర సింహా రెడ్డి’ ఈ సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే..ఈ విజయం పై బాలయ్య బాబు ఫుల్ జోష్ లో సంతోషం గా ఉన్నాడు..అయితే ఈ సినిమాని చూడాల్సిందిగా బాలయ్య బాబు స్పెషల్ గా పవన్ కళ్యాణ్ ని రిక్వెస్ట్ చేసాడట.

ఆయన కోసం ప్రత్యేకంగా ఒక షో ని కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం..అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ ఈ సినిమాని చూడబోతున్నట్టు ఫిలింనగర్ వార్తలు వినిపిస్తున్నాయి..ఇలా దశాబ్దాలుగా ఇండస్ట్రీ లో బాక్స్ ఆఫీస్ పరంగా నువ్వా నేనా అని అనుకునే రేంజ్ పోటీ ఉన్న రెండు పెద్ద కుటుంబాల హీరోలు ఇలా స్నేహపూర్వక వాతావరణం లో మెలగడం చూసి అభిమానులు కూడా ఎంతో సంతోషిస్తున్నారు.