https://oktelugu.com/

Ajith Kumar: అజిత్ ప్రాణాలకు తెగించి ఆ స్టంట్ చేశాడా..? తన భార్య ఏం చెప్పింది..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో అజిత్ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. గతం లో ఆయన చేసిన సినిమాలే ఆయన్ని చాలా ఉన్నతమైన స్థానంలో నిలిపాయి. అలాంటి అజిత్ తన ఫ్యాన్స్ కోసం భారీ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. నిజానికైతే ఆయన డిఫరెంట్ తరహా సినిమాలను ఎంచుకొని చేస్తూ ఉంటాడు. దానివల్ల ప్రేక్షకులలో చాలా కొత్తదనం కనిపించడమే కాకుండా తన నటనతో అజిత్ మెస్మరైజ్ చేస్తూ ఉంటాడు... అందుకే ఆయనకి ఇండియాలో చాలా మంది అభిమానులు ఉన్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 22, 2024 10:09 am
    Ajith Kumar

    Ajith Kumar

    Follow us on

    Ajith Kumar: తమిళ్ సినిమా ఇండస్ట్రీ పేరు చెప్తే మనకు ముందుగా రజనీకాంత్, కమల్ హాసన్ పేర్లు గుర్తుకొస్తాయి. ఇక వాళ్ళ తర్వాత అజిత్ కూడా అంత మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. నిజానికి అజిత్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ అయితే ఉంది. కానీ ఆ మార్కెట్ కాపాడుకోలేకపోయాడు. అందువల్లే తమిళ్ సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యాడు.ఇక ఇప్పటి వరకు అజిత్ తెలుగులో డైరెక్ట్ సినిమాలను చేయడంలో కూడా విఫలమయ్యాడు. ఇక ప్రస్తుతం ఆయన డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇండియాలో ఉన్న అతి కొద్ది మంది మంచి నటుల్లో అజిత్ కూడా ఒకడిని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఆయన సినిమాల్లో వైవిద్య ఉన్నప్పటికి ఆయన క్యారెక్టరైజేషన్ లో మాత్రం ఒకే తరహా పాత్రను పోషిస్తున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు.

    నిజానికి ఆయన బాడీ లాంగ్వేజ్ లో గాని, ఆయన బాడీలో గాని డిఫరెన్స్ చూపించకపోవడానికి కారణం ఏంటంటే ఆయన కి మేజర్ సర్జరీలైతే జరిగాయి. దానివల్ల ఆయన వెయిట్ తగ్గలేకపోతున్నాడు. నిజానికి అజిత్ కి బైక్ రేస్ అంటే చాలా ఇష్టం…తరుచుగా అందులో పాల్గొనేవాడట. ఇక ఆ రేస్ లో పాల్గొన్నప్పుడు ఆయన బైక్ మీద నుంచి పడి పోవడం వల్ల ఆయనకు మేజర్ యాల్సిడెంట్ అయితే జరిగిందట.

    దానివల్ల అప్పట్నుంచి ఆయన బైక్ రేస్ లకి దూరమయ్యాడు. అలాగే తను బరువు కూడా తగ్గలేకపోతున్నాడు. ఇక తన భార్య అయిన శాలిని సైతం ఇక మీదట తను బైక్ రేసుల్లో పాల్గొనబోకూడదని ఒక కండిషన్ అయితే పెట్టిందట. దాన్ని అంగీకరించిన అజిత్ కేవలం సినిమాలను మాత్రమే చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక సర్జరీలు అవ్వడం వల్ల తను వెయిట్ తగ్గలేక సినిమాకు సంబంధించిన మైంటైన్ చేయలేకపోతున్నాడు.

    అయినప్పటికి తన నటన పరంగా మాత్రం ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయడంలో ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయడం లేదు. మరి ఇలాంటి సందర్భంలో అజిత్ నుంచి వచ్చే సినిమాల విషయంలో తను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…