Prabhas looks in Salar 2
Prabhas : యంగ్ రెబల్ స్టార్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన నటుడు ప్రభాస్ (Prabhas)… బాహుబలి (Bahubali) సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ బాక్సాఫీస్ ని సైతం కొల్లగొట్టాడు… అప్పటినుంచి ఆయన చేసిన వరుస సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా గత రెండు సినిమాలు అయిన సలార్ (Salaar), కల్కి (Kalki) లాంటి సినిమాలతో భారీ విజయాలను అందుకున్న ఆయన ఇప్పుడు ఫౌజీ (Fouji), స్పిరిట్(Spirit), రాజాసాబ్ (Rajasaab) సినిమాలతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమాలన్నీ కూడా ఆయనలోని వైవిధ్యమైన నటుడిని బయటికి తీస్తాయని ఆయా దర్శకులు చెబుతూ ఉండడం విశేషం…ఇక వీటితో పాటుగా ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే ‘సలార్ 2’ (Salaar 2) సినిమా మీద కూడా తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నాడట. అయితే ఆయన్ చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా మీద ఆయన పూర్తి ఫోకస్ పెట్టబోతున్నాడు. ఇక ఇప్పటికే సలార్ 2 సినిమా మీద దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎప్పుడో ఒకసారి ఏదో ఒక న్యూస్ అయితే బయటికి రివీల్ చేస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు సలార్ 2 లో ప్రభాస్ ఒక గొప్ప రాజుగా కనిపించబోతున్నాడని బాహుబలిలో ఏ విధంగా అయితే ఆయన రాజసాన్ని చూపించాడో ఈ సినిమాలో కూడా అంతకు మించి తన రాజసాన్ని చూపిస్తూ, జనాన్ని కాపాడుతూ, తన సైన్యాన్ని కాపాడుకుంటూ అవతలి వాళ్ళ మీద యుద్ధాన్ని చేస్తూ ముందుకు సాగుతాడని ప్రశాంత్ నీల్ ఇంతకుముందు గతంలో తెలియజేశాడు…
ఇక మొత్తానికైతే ప్రభాస్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు వరుసగా బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయడమే బ్యాలెన్స్ గా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రశాంత్ నీల్ చెయ్యబోయే సలార్ 2 మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.
మరి ఆ అంచనాలకి తగ్గట్టుగానే ఈ సినిమాని తెరకెక్కించి ప్రభాస్ లోని ఒక కొత్త యాంగిల్ ని కూడా చూపించబోతున్నాను అంటూ ఇంతకుముందు ప్రశాంత్ నీల్ కొన్ని ఇంటర్వ్యూల్లో తెలియజేశాడు. తను చూపించింది కొంత పార్ట్ అని చాలా సందర్భాల్లో తెలియజేసిన విషయం మనకు తెలిసిందే…
ఇక ప్రభాస్ ను ఎక్కడ తగ్గకుండా చాలా హై లెవెల్లో చూపిస్తానని ఎమోషన్స్ లో గాని, ఎలివేషన్స్ లో గాని తారాస్థాయిలో మనకు ప్రభాస్ కనిపిస్తాడని ప్రశాంత నీల్ కూడా చేసిన అన్ని సినిమాలు మంచి విజయాలను సాధిస్తుండడంతో ఆయనకు కూడా పాన్ ఇండియాలో మంచి మార్కెట్ అయితే క్రియేట్ అయింది. ఇక ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత సలార్ 2 సినిమాను చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు…