Bollywood Hero
Bollywood Hero : సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలు ఒకటి రెండు సినిమాలతో సక్సెస్ లు అందుకుంటేనే చాలా వరకు హడావిడి చేస్తూ ఉంటారు… కొంతమంది నటులు మాత్రం వాళ్లకు ఎన్ని సక్సెస్ లు వచ్చినా ఎంత డబ్బును సంపాదించుకున్న కూడా చాలా సింపుల్ గా ఉండడానికి ఇష్టపడుతుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు డౌన్ టు ఎర్త్ ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారనే విషయం మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్న సైఫ్ అలీ ఖాన్ పాటౌడి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికి ఆయన మాత్రం చాలా సింపుల్ గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. ఒకప్పుడు హీరోగా ఆ తర్వాత విలన్ పాత్రలను పోషిస్తూ ముందుకు సాగుతున్న ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన ఇంట్లో ఒక దొంగ చొరబడి అతని మీద దాడి చేసిన విషయం మనకు తెలిసిందే…
మొత్తానికైతే ఏ ప్రమాదం జరగకుండా ఆయన బయటపడ్డాడు ఇక ఇదిలా ఉంటే 50,000 కోట్లకు అధిపతి అయినప్పటికి ఆయన చాలా సింపుల్ గా ఉండటాన్ని చాలామంది ఇష్టపడుతుంటారు.పటౌడి ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు… ప్రస్తుతం ఆయన తెలుగు హిందీ సినిమాల్లో విలన్ పాత్రలను పోషించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు.
ఇక దేవర సినిమాలో ఆయన పండించిన విలనిజం అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆయనకి మరికొన్ని తెలుగు సినిమాల నుంచి అవకాశాలైతే వచ్చాయి. కానీ అనుకోకుండా అతని మీద దాడి జరగడంతో ఆయన కొద్ది రోజులపాటు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరమైతే ఉందని డాక్టర్లు చెప్పడంతో ప్రస్తుతం ఆయన సినిమా ఇండస్ట్రీకి కొద్దిరోజుల పాటు దూరమవుతున్నాడు…
ఇక ఏది ఏమైనా కూడా సైఫ్ అలీ ఖాన్ లాంటి నటులు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నప్పటికి ఆయన లాంటి సింప్లీసిటీని కోరుకునే హీరోలు మాత్రం చాలా తక్కువ సంఖ్యలో ఉంటారని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండడం విశేషం…50 వేల కోట్ల ఆస్తికి అధిపతి అయిన కూడా ఆయన ఎక్కడ కూడా ఆ అహంకారం అయితే చూపించడు. అందువల్లే ఆయనకు చాలా ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు…