https://oktelugu.com/

Vidadala  Rajini : జనసేనలోకి మాజీ మంత్రి.. బాలినేని మధ్యవర్తిత్వం!

జనసేనలో మరో మాజీ మంత్రి చేరనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి బాలినేని మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమాచారం.

Written By: , Updated On : February 16, 2025 / 11:16 AM IST
Vidadala  Rajini

Vidadala  Rajini

Follow us on

Vidadala  Rajini: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏ నేత ఏ పార్టీలో ఉంటారో చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున గుడ్ బై చెబుతున్నారు. గత ఐదేళ్లుగా వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించి, పదవులు పొందిన వారు సైతం రాజీనామాలు ప్రకటిస్తున్నారు. పార్టీలో నెంబర్ 2 గా ఎదిగిన విజయసాయిరెడ్డి లాంటి నేత బయటకు వెళ్లిపోతారని ఎవరు అనుకోలేదు. కానీ అనూహ్యంగా ఆయన పార్టీకి గుడ్ బై చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు చాలామంది వైసిపి నేతలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ప్రధానంగా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి విడదల రజిని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. త్వరలో ఆమె పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె మాత్రం వైసీపీలో యాక్టివ్ గానే ఉన్నారు.

* వైయస్సార్ కాంగ్రెస్ సమావేశానికి హాజరు
కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లాకు సంబంధించి వైఎస్సార్ సీపీ శ్రేణులతో సమావేశం అయ్యారు అధినేత జగన్మోహన్ రెడ్డి. ఈ సమావేశానికి మాజీమంత్రి విడదల రజిని(Vidadala  Rajini ) కూడా హాజరయ్యారు. మరోవైపు ఆమె మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన కుటుంబం జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. మళ్లీ అధికారంలోకి వస్తామని.. అందరి లెక్క తేల్చుతామని హెచ్చరికలు పంపారు. దీనిపై ప్రతి పార్టీ పుల్లారావు కూడా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. దీంతో కేసులతో ఇబ్బంది పడడం ఖాయమని రజిని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే ఇబ్బందులు తప్పవని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. అందుకే జనసేనలో చేరేందుకు ఆమె నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది.

* బాలినేని ద్వారా మంత్రాంగం
ప్రస్తుతం వైసీపీ నుంచి వెళ్లిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి( balineni Srinivas Reddy ) జనసేనలో యాక్టివ్ గా ఉన్నారు. గతంలో ఆయన జనసేనలో చేరే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తరపున మాట్లాడేందుకు వెళ్లారు రజని. ఇప్పుడు అదే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ద్వారా రజిని జనసేనలో చేరతారని ప్రచారం నడుస్తోంది. 2019 ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రజిని. ప్రత్తిపాటి పుల్లారావు పై విజయం సాధించి రికార్డు సృష్టించారు. జగన్మోహన్ రెడ్డి రజనిని తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. అయితే ఎన్నికల్లో చిలకలూరిపేట కాకుండా గుంటూరు పశ్చిమ స్థానం నుంచి పోటీ చేయించారు. కానీ ఓటమి ఎదురైంది.

* కేసులకు భయపడి
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో కొనసాగుతున్న ఆమెను కూటమి వెంటాడే అవకాశం ఉంది. ప్రధానంగా ఆమె నిర్వర్తించిన శాఖలు వైఫల్యాలను బయటకు తీసే పనిలో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కేసులను ఎదుర్కోవడం కంటే పార్టీ మారడమే ఉత్తమమని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. అతి త్వరలో ఆమె జనసేనలో చేరుతారని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.