https://oktelugu.com/

NTR And Atlee: ఎన్టీయార్, అట్లీ కాంబినేషన్ లో సినిమా రాబోతుందా..?ఒకవేళ వీళ్ళ కాంబోలో సినిమా వస్తె ఇండస్ట్రీ హిట్ కొడుతుందా..?

సినిమా ఇండస్ట్రీ అనేది ఒక బిజినెస్... ప్రొడ్యూసర్ ఎంత డబ్బులు పెడితే దానికి రిటర్న్ ఎంత వస్తుందనే దాని మీదనే సినిమాలనేవి ఆధారపడి ఉన్నాయి. ఇక కమర్షియల్ సినిమాలకు ప్రస్తుతం చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఆర్ట్ సినిమాలను మెజారిటీ ప్రేక్షకులు ఆదరించినప్పటికి వాటికి ఎక్కువ కలెక్షన్స్ రావు. కాబట్టి ప్రతి ఒక్కరు కమర్షియల్ సినిమాల మీదనే ఫోకస్ చేస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 29, 2024 / 06:11 PM IST

    NTR And Atlee

    Follow us on

    NTR And Atlee: సౌత్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఉన్నప్పటికీ తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన అట్లీ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక రీసెంట్ గా ఆయన జవాన్ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాడు. షారుఖాన్ కెరియర్ లోనే ఇప్పటివరకు సాధించలేని సక్సెస్ ని సాధించి పెట్టాడు. కాబట్టి తనకు పాన్ ఇండియాలో భారీ మార్కెట్ అయితే క్రియేట్ అయింది. బాలీవుడ్ కండల వీరుడు అయిన సల్మాన్ ఖాన్ తో సినిమా చేస్తున్నాడు.ఇక అన్ని కుదిరితే అట్లీ అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సింది. కానీ రెమ్యూనరేషన్ విషయంలో చిన్నపాటి డిస్టబెన్స్ రావడం తో ఆయన సల్మాన్ ఖాన్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. దానితో అల్లు అర్జున్ తో సినిమాను క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇక మొత్తానికైతే ఆయన కమర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అట్లీ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజానికి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం అది ఎన్టీయార్ అభిమానులతో పాటుగా అట్లీ అభిమానులు కూడా పండుగ చేసుకునే విషయమనే చెప్పాలి. నిజానికి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందనే ఊహ వస్తేనే ఆ సినిమా ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టించబోతుందో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు.

    ఒకవేళ మేకర్స్ కనక వీళ్ళ కాంబినేషన్ లో సినిమాని సెట్ చేసినట్లైతే అది భారీ బజ్ ను క్రియేట్ చేయడమే కాకుండా ఇండియాలోనే ఆ సినిమా సూపర్ హిట్ గా నిలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే డ్రాగన్ సినిమా మీదనే ఆయన తన పూర్తి ఫోకస్ ను పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది.

    మరి ఇలాంటి సందర్భంలో అట్లీ చేస్తున్న సినిమా పూర్తై న తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కే అవకాశాలైతే ఉన్నట్టుగా చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక ఏది ఏమైనా కూడా ఈ కాంబినేషన్ కనక వర్కౌట్ అయితే మాత్రం ఇండస్ట్రీలో ఏ రికార్డు కూడా మిగిలి ఉండదనే చెప్పాలి.

    ఎందుకంటే మాస్ సీన్స్ ని భారీ ఎత్తున చూపించగలిగే దర్శకుడు అట్లీ…అలాగే ఎలాంటి పాత్రను అయిన అలవోకగా చేసి మెప్పించ గలిగే సత్తా ఉన్నటువంటి నటుడు ఎన్టీయార్…ఇక వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందనే వార్త తెలిస్తేనే ఎన్టీయార్ ఫ్యాన్స్ లో పూనకాలు వస్తాయనే చెప్పాలి…