https://oktelugu.com/

Adivi Sesh: అడవి శేష్ క్రేజ్ ని తెగ వాడేస్తున్న అల్లు అర్జున్ టీం..వైరల్ గా మారిన అడవి శేష్ లేటెస్ట్ పోస్ట్!

బ్రాండ్ ఇమేజ్ ఎంతలా పెరిగిందంటే అల్లు అరవింద్, అల్లు అర్జున్ వంటి వారు కూడా తమకోసం వాడుకునేంతలాగా అన్నమాట. పూర్తి వివరాల్లోకి వెళ్తే అల్లు అరవింద్ స్థాపించిన 'ఆహా' ఓటీటీ యాప్ అతి తక్కువ సమయంలోనే మంచి బ్రాండ్ ఇమేజిని సంపాదించుకునేం సంగతి తెలిసిందే. దేశంలో ఉన్న టాప్ 10 ఓటీటీ యాప్స్ లో ఆహా కూడా ఒకటి. అతి తక్కువ రేటుకే సస్క్రైబర్ అయ్యే అవకాశాన్ని కల్పించిన ఆహా టీం, లేటెస్ట్ గా గోల్డ్ ప్రీమియం ని ప్రమోట్ చేయడం కోసం అడవి శేష్ ని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 29, 2024 / 06:03 PM IST

    Adivi Sesh

    Follow us on

    Adivi Sesh: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి సక్సెస్ అయిన వారిలో ఒకరు అడవి శేష్. క్యారక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని ప్రారంభించిన ఈయన, ఆ తర్వాత విలన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. అలా తనకి వచ్చిన ఫేమ్ తో ‘క్షణం’ సినిమాతో హీరోగా మారాడు. ఆ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో, అడవి శేష్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. స్పై జానర్ లో సరికొత్త కథలను ఎంచుకుంటూ, ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేస్తూ టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. అడవి శేష్ సినిమా విడుదల అవుతుందంటే కచ్చితంగా థియేటర్ కి వెళ్లి చూడాలి అనిపించేంత ఇమేజ్ తెచ్చుకున్నాడు. స్పై చిత్రాలు చేయాలంటే అడవి శేష్ తర్వాతే ఎవరైనా అని విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు.

    ఆయన బ్రాండ్ ఇమేజ్ ఎంతలా పెరిగిందంటే అల్లు అరవింద్, అల్లు అర్జున్ వంటి వారు కూడా తమకోసం వాడుకునేంతలాగా అన్నమాట. పూర్తి వివరాల్లోకి వెళ్తే అల్లు అరవింద్ స్థాపించిన ‘ఆహా’ ఓటీటీ యాప్ అతి తక్కువ సమయంలోనే మంచి బ్రాండ్ ఇమేజిని సంపాదించుకునేం సంగతి తెలిసిందే. దేశంలో ఉన్న టాప్ 10 ఓటీటీ యాప్స్ లో ఆహా కూడా ఒకటి. అతి తక్కువ రేటుకే సస్క్రైబర్ అయ్యే అవకాశాన్ని కల్పించిన ఆహా టీం, లేటెస్ట్ గా గోల్డ్ ప్రీమియం ని ప్రమోట్ చేయడం కోసం అడవి శేష్ ని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్నారు.

    ఈ సందర్భంగా అడవి శేష్ ఇంస్టాగ్రామ్ లో తన ఆనందాన్ని పంచుకుంటూ ‘ఆహా గోల్డ్ లో నేను కూడా ఒక భాగం అయ్యినందుకు చాలా సంతోషం గా ఉంది. సరికొత్త వెబ్ సిరీస్లు, సినిమాలు, రియాలిటీ టాక్ షోస్ వంటి అద్భుతమైన కంటెంట్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించడమే కాకుండా, సినీ పరిశ్రమని ఆడియన్స్ కి మరింత చేరువ అయ్యేలా చేసింది ఈ ఆహా యాప్. ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా అభిమానులు సెట్స్ లోకి వచ్చి సెలెబ్రిటలను, తమ అభిమాన హీరో హీరోయిన్లను చూసుకునే అవకాశం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, కేవలం 899 రూపాయిలు మాత్రమే’ అంటూ ఒక స్టోరీ ని అప్లోడ్ చేసాడు అడవి శేష్. ఇక ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, 2018 వ సంవత్సరం లో విడుదలైన గూఢచారి చిత్రానికి సీక్వెల్ గా ‘గూఢచారి 2 ‘ చేస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి, ఈ చిత్రంతో పాటుగా ఆయన ‘డెకాయిట్’ అనే మరో చిత్రం చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా నుండి శృతి హాసన్ తప్పుకున్న సంఘటన సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.