Andarivaadu- Waltair Veerayya: చిరంజీవి ఎనర్జీని యంగ్ హీరోలు కూడా అందుకోలేకున్నారు. ఏక కాలంలో మూడు నాలుగు చిత్రాలు చేస్తున్న చిరంజీవి నెలల వ్యవధిలో వాటిని విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ లో ఆచార్య రిలీజ్ కాగా అక్టోబర్ లో గాడ్ ఫాదర్ అంటూ దసరా బరిలో దిగారు. మరో మూడు నెలల్లో వాల్తేరు వీరయ్యగా ఫ్యాన్స్ ని అలరించనున్నారు. దీపావళి సందర్భంగా చిరంజీవి 154వ చిత్ర టైటిల్, టీజర్ విడుదల చేశారు. టైటిల్ గా వాల్తేరు వీరయ్య ఫిక్స్ చేశారు. ఇక రెండున్నర నిమిషాల మూవీ టీజర్ దుమ్మురేపింది. అభిమానులు చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారో వాల్తేరు వీరయ్యలో అలా ఉన్నారు.

చిరంజీవి 90లలో చేసిన ఊరమాస్ చిత్రాలు ముఠామేస్త్రి, రౌడీ అల్లుడు, రిక్షావోడు ని వాల్తేరు వీరయ్య లుక్ తలపించింది. టీజర్ చూశాక ఫ్యాన్స్ థ్రిల్ ఫీలయ్యారు. సినిమా ఓ రేంజ్ లో ఉంటుందనే అంచనాకొచ్చారు. ఇదే సమయంలో చిత్ర కథపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. వాల్తేరు వీరయ్య కథ ఇదే అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవి-రవితేజ సవతి తల్లుల పిల్లలు అట. వరసకు అన్నదమ్ములు అవుతారట. చిరంజీవితో రవితేజ ఘర్షణ ఒక రేంజ్ లో ఉంటుందంటూ ఒక వాదన మొదలైంది.
అలాగే మరొక వాదన కూడా తెరపైకి వచ్చింది. 2005లో విడుదలైన అందరివాడు సినిమాతో వాల్తేరు వీరయ్యకు లింక్ ఉంది అంటున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన అందరివాడు మూవీలో చిరంజీవి తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్ చేశారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన అందరివాడు సినిమాతో వాల్తేరు వీరయ్య కు లింక్ ఉందన్న వార్తల నేపథ్యంలో, ఆ లింక్ ఏమిటనే ఆసక్తి పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

దర్శకుడు బాబీ వాల్తేరు వీరయ్య చిత్రానికి దర్శకుడిగా ఉన్నారు వైజాగ్ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య తెరకెక్కుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. టీజర్లో దీనిపై స్పష్టత ఇచ్చారు. శృతి హాసన్ మొదటిసారి చిరంజీవితో జతకడుతున్నారు. దేవిశ్రీ వాల్తేరు వీరయ్య చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. వాల్తేరు వీరయ్య పై పరిశ్రమలో అంచనాలు ఏర్పడ్డాయి. ఆదిపురుష్, వారసుడు, వీరసింహారెడ్డి, ఏజెంట్ చిత్రాలతో వాల్తేరు వీరయ్య పోటీపడనుంది.