Pawan Kalyan Allu Arjun cold war: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య పోటీ ఉంటుందనే విషయం మనందరికి తెలిసిందే. సినిమాలపరంగా వాళ్ళ మధ్య పోటీ ఉన్నప్పటికి పర్సనల్ విషయంలో మాత్రం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. ఇక మెగా ఫ్యామిలీ పేరు చెప్పి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అల్లు అర్జున్ ప్రస్తుతం అల్లు ఫ్యామిలి అంటూ ఒక సపరేట్ ట్యాగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. దాంతో మెగా అభిమానుల నుంచి విమర్శలను మూటగట్టుకుంటున్నాడు. నిజానికి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ తన ఫేవరెట్ హీరో అని చెప్పుకుంటూ వచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి కూడా పెద్దగా ఇష్టపడడం లేదు…ఇక అల్లు శిరీష్ మ్యారేజ్ ఈవెంట్లో సైతం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని కలవలేదు. అల్లు అర్జున్ సైతం పవన్ కళ్యాణ్ కి కలవడానికి కూడా ట్రై చేయనట్టుగా తెలుస్తుంది.
ఇక అల్లు అర్జున్ ఈవెంట్ కి వచ్చిన అందర్నీ అల్లు ఆహ్వానించాడు. కానీ పవన్ కళ్యాణ్ ను మాత్రం కలవలేదు. కారణం ఏదైనా కూడా వీళ్ళిద్దరి మధ్య చాలా రోజుల నుంచి కోల్డ్ వారైతే నడుస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి… ఇక పవన్ కళ్యాణ్ మీద కోపంతోనే 2024 ఎలక్షన్స్ టైమ్ లో అల్లు అర్జున్ నంద్యాల ఎమ్మెల్యే కి సపోర్టు చేశాడు.
అయినప్పటికి వైసిపి పార్టీ 11 సీట్లకు మాత్రమే పరిమితం అవ్వడంతో అల్లు అర్జున్ క్రేజీ సైతం పడిపోయింది అంటూ చాలా వార్తలైతే వచ్చాయి. ఇక ఏది ఏమైనా కూడా వీరిద్దరి మధ్య ఇంత పెద్ద కోల్డ్ వార్ జగడానికి కారణం అల్లు అరవింద్ అంటూ ప్రతి ఒక్కరు చెబుతున్నారు. కారణమేమిటి అంటే అల్లు అరవింద్ చేసిన పనులు పవన్ కళ్యాణ్ కి నచ్చలేదు.
దాంతో పవన్ కళ్యాణ్ వాళ్లతో సినిమా చేయడానికి గానీ వాళ్లతో మాట్లాడటానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతో అల్లు అర్జున్ సైతం పవన్ కళ్యాణ్ తో మాట్లాడడానికి పెద్దగా ఆసక్తి చూపించనట్టుగా తెలుస్తుంది…మరి తొందర్లోనే వీళ్ళ మధ్య గొడవలు తగ్గి మళ్ళీ ఇంతకు ముందులా మాట్లాడుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది…