Dhurandhar impact on Tollywood: పాన్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికి రానటువంటి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న వాళ్ళలో తెలుగు స్టార్ హీరోలు మొదటి వరుసలో ఉన్నారు. చేసిన అన్ని సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. అయితే రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో అయిన రన్వీర్ సింగ్ సైతం దురంధర్ సినిమాతో గొప్ప విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. నిజానికి ఈ సినిమా 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులకు చెక్ పెడుతూ 1000 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టడం అనేది చాలా గొప్ప విషయం… ఇప్పటివరకు ఏ సినిమాకి రానటువంటి గుర్తింపును సంపాదించుకొని ముందుకు సాగుతోంది. ఈ సినిమా కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయింది. టిక్కెట్ రేట్ల ను సైతం పెంచలేదు. అయినప్పటికి ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టిందనే చెప్పాలి.
ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమా వచ్చిందంటే చాలు టిక్కెట్ రేట్లు భారీ ఎత్తున పెంచేస్తున్నారు. ఇప్పటికైనా దురంధర్ సినిమాని చూసి భారీ కలెక్షన్స్ ను రాబట్టడం ఎలాగో నేర్చుకోండి అంటూ సినిమా మేధావులు సైతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికి కనువిప్పు కలిగేలా చెబుతున్నారు…
ఇప్పటికైనా టిక్కెట్ రేటు పెంచి జనాలను హింసించడం కంటే మంచి కాన్సెప్ట్ తో వచ్చి ప్రేక్షకులను మెప్పించగలిగితే మంచిదని చాలా మంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు… ఇక ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన నడిచింది. కానీ ఇక మీదట చేయబోయే సినిమాల విషయాల్లో స్పెషల్ కేర్ తీసుకోకపోతే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ ను చేరుకోవాలంటే మాత్రం మంచి కాన్సెప్టులతో సినిమాలు చేయాల్సిన అవసరమైతే ఉంది…ఇక సంక్రాంతికి రాబోతున్న సినిమాలు సైతం కంటెంట్ తో మెప్పిస్తే ఆ మూవీస్ కి జనాలు నీరాజనాలు పడుతారు…