https://oktelugu.com/

Manchu family : మంచు కుటుంబ వివాదాలకు హ్యాపీ ఎండింగ్..? మనోజ్ సపోర్టుగా మంచు లక్ష్మి..ఇరకాటంలో పడ్డ మోహన్ బాబు!

గత రెండు మూడు రోజులుగా మీడియా లో మంచు కుటుంబం లో రేగిన వివాదం గురించి ఏ రేంజ్ లో చర్చలు నడిచాయి మనమంతా చూసాము.

Written By:
  • Vicky
  • , Updated On : December 12, 2024 / 03:06 PM IST

    Manchu family

    Follow us on

    Manchu family : గత రెండు మూడు రోజులుగా మీడియా లో మంచు కుటుంబం లో రేగిన వివాదం గురించి ఏ రేంజ్ లో చర్చలు నడిచాయి మనమంతా చూసాము. మనోజ్ తన తండ్రి మోహన్ బాబు కేసు పెట్టడం, మోహన్ బాబు కూడా అతనిపై రివర్స్ లో కేసు పెట్టడం, ఆ మనోజ్ ని ఇంటి నుండి మోహన్ బాబు గెంటేయడం, మనోజ్ ఇంటి గేట్లను బద్దలు కొట్టుకొని లోపలకు వెళ్లడం, ఇవన్నీ కెమెరాలతో చిత్రీకరిస్తున్న మీడియా పై మోహన్ బాబు దాడి చేయడం, ఆ తర్వాత ఆయన మనోజ్ గురించి సంచలన ఆడియో ని రికార్డు చేసి మీడియా కి వదలడం, మనోజ్ దానిపై మీడియా తో స్పందిస్తూ, సాయంత్రం ప్రెస్ మీట్ పెడతానని, ఆధారాలతో సహా నిజానిజాలు తెలిసేలా చేస్తానని చెప్పడం, ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ ని రద్దు చేసుకోవడం, ఇలా ఎన్నో మలుపులతో ఈ వివాదం గత మూడు రోజులుగా ట్రెండింగ్ లో ఉంది.

    అయితే ఇప్పుడు వివాదం చల్లారిందని, మళ్ళీ మంచు కుటుంబం ఒక్కటైపోయిందని ఇప్పుడు లేటెస్ట్ గా సోషల్ మీడియా లో మరో వార్త వినిపిస్తుంది. మంచు మనోజ్ ప్రెస్ మీట్ ని రద్దు చేసుకోవడానికి కారణం కూడా అదేనట. మోహన్ బాబు సన్నిహితులు ఈ సమస్యని పెద్దది చేయకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలే చేశారట. కుటుంబ సమస్యలను మీడియా ముందు ఉంచి, ప్రేక్షకులకు బిగ్ బాస్ షో లాగా చూపిస్తున్నారని, ఈ గొడవకి ఇక్కడితో శుభం కార్డు వెయ్యకపోతే, అది పెరుగుతూ పోతుందని, ఇన్ని రోజులు కష్టపడి సంపాదించుకున్న పరువు మర్యాదలు బూడిద పాలవుతాయని, సమాజం లో తల ఎత్తుకొని తిరగలేని పరిస్థితులు వస్తాయని సన్నిహితులు మోహన్ బాబు కి చెప్పడంతో ఆయన అందుకు అంగీకరించి, మనోజ్ తో సామరస్యంగా చర్చించుకొని సమస్యని పరిష్కరించుకునేందుకు అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది.

    పైగా మోహన్ బాబు కి ఇంట్లో మంచు విష్ణు, వినయ్ ల సపోర్టు మాత్రమే ఉండగా, మనోజ్ కి అతని తల్లితో పాటు, సోదరి మంచు లక్ష్మి సపోర్టు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో మోహన్ బాబు కూడా తలవంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. మంచు మనోజ్ ఇల్లు వదిలి వెళ్ళడానికి అతని తల్లి ఏమాత్రం ఒప్పుకోలేదని, మనోజ్ వెళ్ళిపోతే అతనితో పాటు తాను కూడా శాశ్వతంగా వెళ్లిపోతానని మోహన్ బాబు కి తెగేసి చెప్పిందట. దీంతో మోహన్ బాబు మనోజ్ ని ఇంట్లో ఉంచేందుకు అంగీకారం తెలిపినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీళ్లంతా కలిసి ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ, మోహన్ బాబు, మనోజ్, విష్ణులు ఇంతకు ముందు లాగా మాట్లాడుకునే పరిస్థితులు ఇప్పట్లో ఏర్పడేలా లేవు. విష్ణు శాశ్వతంగా తన కుటుంబంతో దుబాయి లో స్థిరపడ్డాడు. అప్పుడప్పుడు షూటింగ్స్ కోసం, విద్యానికేతన్ యూనివర్సిటీ వ్యవహారాల కోసం ఆయన ఇండియా కి వచ్చి వెళ్తుంటాడు.