Mana Shankara Varaprasad Garu Songs: మన టాలీవుడ్ లో యూత్ ఆడియన్స్ ని ఒక రేంజ్ లో ఉర్రూతలూ ఊగించిన మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు రమణ గోగుల(Ramana Gogula). అప్పట్లో ఈయన ఎక్కువగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సినిమాలకు సంగీత అందిస్తూ ఉండేవాడు. ఈ గొంతు కూడా పవన్ కళ్యాణ్ కి చాలా చక్కగా కుదిరేది. పవన్ కళ్యాణ్ పాడుతున్నట్టుగానే అనిపించింది. ఇక ఆ తర్వాత వెంకటేష్ తో కలిసి ఎక్కువ సినిమాలు పని చేసాడు రమణగోగుల. అయితే గత కొన్నేళ్ల క్రితమే ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చి, తన వ్యాపారాలను చూసుకోవడం కోసం అమెరికా కి వెళ్ళిపోయాడు. అలాంటి రమణగోగుల చాలా రోజుల తర్వాత ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం లో ఆయన పాడిన ‘గోదారి గట్టు మీద రామచిలకవే’ అనే పాట ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
యూట్యూబ్ లో ఈ పాటకు 250 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఈ చిత్రం తర్వాత ఆయన ఓజీ చిత్రం లో క్లైమాక్స్ లో వచ్చే ర్యాప్ సాంగ్ పాడాడు. అనిల్ రావిపూడి(Anil Ravipudi) రమణ గోగుల ని ఇండస్ట్రీ లోకి మళ్లీ తీసుకొచ్చాడు కాబట్టి, కచ్చితంగా ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం లో కూడా ఒక పాట పాడిస్తాడని అంతా అనుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ చిత్రం లో రమణ గోగుల తో చిరంజీవి ఇంట్రడక్షన్ పాట ని పాడించాడు అట. కానీ అది ఎందుకో చాలా మెలోడియస్ డ్యూయెట్ లాగా ఉందని, మెగాస్టార్ చిత్రం లో మొదటి పాట అలా ఉంటే వర్కౌట్ అవ్వదు కాబట్టి ఆ పాటని పక్కన పెట్టేశామని చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. మరి రాబోయే రోజుల్లో ఆ పాటని ఏమైనా బయట విడుదల చేస్తారా అని యాంకర్ అడుగుతుంది.
అందుకు అనిల్ రావిపూడి సమాధానం చెప్తూ ‘అసలు విడుదల చేయను, ఈ పాటని నేను నా తదుపరి చిత్రానికి వాడుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అనిల్ రావిపూడి తదుపరి చిత్రం విక్టరీ వెంకటేష్ తో చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈ పాట ని అందులోనే ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం ఒక లైన్ ని అనుకున్నాను అని , ఇది నేను ఏ హీరో తో చేయబోతున్నాను అనేది చాలా మంది చాలా రకాలుగా చెప్పుకొస్తున్నారు కానీ, ఇప్పటి వరకు అయితే నేను ఏ హీరో ని సంప్రదించలేదని , స్క్రిప్ట్ రెడీ అయ్యాక, ఆ స్క్రిప్ట్ కి ఏ హీరో అయితే సరిపోతాడో, ఆ హీరో నే ఎంచుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి.