Ambati Rambabu Over Lokesh Red Book: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ రాస్తున్నట్లు లోకేష్( Minister Nara Lokesh) ప్రకటించారు. ఎందుకంటే అప్పట్లో జగన్ సర్కార్ టిడిపిని టార్గెట్ చేసుకునేది. కేసులతో వెంటాడేది. అరెస్టులు చేసేది. దీంతో దానిని హెచ్చరిస్తూ నారా లోకేష్ రెడ్డి బుక్ రాస్తున్నానని.. తప్పు చేసిన వారి పేర్లు రాసుకుంటున్నానని.. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి పని పడతానంటూ హెచ్చరికలు జారీ చేశారు నారా లోకేష్. అయితే టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు దూకుడు కలిగిన వైసీపీ నేతలతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కొందరు దూకుడు కలిగిన వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు. మరికొందరు రాష్ట్రానికి దూరంగా ఉంటున్నారు. అయితే వైసీపీలో హుందాగా వ్యవహరించిన వారి జోలికి మాత్రం వెళ్లడం లేదు. అయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు మాత్రం పదే అదే రెడ్ బుక్ ను గుర్తు చేస్తున్నారు. ఆ రెడ్ బుక్ కు తన కుక్క కూడా భయపడదని తేల్చి చెబుతున్నారు. ఆయన ఆత్రుత చూస్తుంటే తనను అరెస్టు చేయండి అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ అంబటి రాంబాబును మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు.
పక్క రాష్ట్రాల్లో ఉండి..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి చెందిన చాలామంది నేతలు సైలెంట్ అయ్యారు పెద్దగా మాట్లాడడం లేదు కూడా. అటువంటి వారిలో అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. వైసిపి హయాంలో ఆయన మంత్రిగా ఉండేటప్పుడు దారుణ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చంద్రబాబుతో పాటు లోకేష్ ను చులకన చేసి మాట్లాడారు. మాజీ మంత్రి కొడాలి నాని గురించి చెప్పనవసరం లేదు. నిత్యం బూతులతో రెచ్చిపోయేవారు. ఆయన మంత్రిగా కంటే చంద్రబాబు కుటుంబం పై విమర్శలు చేసే వివాదాస్పద నేతగానే ఏపీ ప్రజలు చూసేవారు. తప్పకుండా వీరిద్దరి పేరు రెడ్ బుక్ లో ఉంటాయి. కానీ ఇంతవరకు వారిపై చర్యలు లేవు. వారు సైతం పక్క రాష్ట్రాల్లోనే ఎక్కువగా గడుపుతున్నారు.
అజ్ఞాతంలోకి వెళ్లి వస్తూ..
మధ్యలో పేర్ని నాని ఒకరు గట్టిగానే మాట్లాడుతుంటారు. అయితే కేసులతో పాటు అరెస్టుల భయం ఉన్నప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. కోర్టుల నుంచి ఉపశమనం దక్కితే మళ్ళీ బయటకు వచ్చి విమర్శలు చేస్తుంటారు. అయితే మీడియా ముందుకు వచ్చి స్వేచ్ఛగా మాట్లాడేది మాత్రం అంబటి రాంబాబు. ఆపై గుడివాడ అమర్నాథ్. అయితే వీరిని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే రెడ్ బుక్ కు నా కుక్క కూడా భయపడడం లేదని చెబుతున్నారు అంబటి రాంబాబు. అయితే వీరిని పట్టించుకోకుండా ఉంది ప్రభుత్వం. కానీ అంబటి హెచ్చరికలు చూస్తుంటే.. ఇండైరెక్టుగా పక్క రాష్ట్రాల్లో భయంతో గడుపుతున్న వారిని అరెస్టు చేయండి అన్నట్టు ఉంది. ప్రతిరోజు అదే మాట చెబుతున్నారు అంబటి. ఏవేవో సింకులేని కామెంట్స్ చేస్తున్నారు గుడివాడ అమర్నాథ్. అప్పుడప్పుడు వచ్చి లాజిక్కులు మాట్లాడుతున్నారు పేర్ని నాని. కానీ వీరి జోలికి వెళ్లడం లేదు. అయితే వీరి మాటలు ఎక్కడో ఉన్న మాజీ మంత్రులకు కాక రేపుతున్నాయి. అనవసరంగా తమను బుక్ చేస్తారన్న భయం బయట రాష్ట్రాల్లో ఉన్న వైసిపి నేతలకు ఉంది. అందుకే అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని తీరులపై ఆగ్రహంగా ఉన్నారు వారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.