Kota Srinivasa Rao: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గర్వించదగ్గ మహానటులు ఎంతో మంది ఉన్నారు. వారిలో ఎస్వీ రంగారావు గురించి మాట్లాడుకోకుండా ఉండగలమా. నటన లో ఈయనకి సాటి వచ్చే నటులు ఎవ్వరూ లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి మహానటుడు మళ్ళీ పుట్టలేదు కానీ, ఆయనతో పోలుస్తూ నేటి తరం ఎస్వీ రంగారావు గా పేరు సంపాదించిన మహానటుడు మాత్రం కోటా శ్రీనివాసరావు మాత్రమే. ఈయన చెయ్యలేని పాత్ర అంటూ ఏది లేదు. భయంకరమైన విలనిజం తో భయపెట్టగలడు, అద్భుతమైన కామెడీ టైమింగ్ తో నవ్వు రప్పించగలడు, బీభత్సమైన సెంటిమెంట్ తో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించగలడు.
ఇలా నవరసాలు అలవోకగా పండించే నటులు దొరకడం మన తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం. ఇలాంటి మహానటులు ఇతర ఇండస్ట్రీ లో కూడా ఉండరు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం కోటా శ్రీనివాసరావు వయస్సు బాగా పెరగడంతో, ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. కానీ ఆయనకీ బోర్ కొట్టినప్పుడు డైరెక్టర్స్ ఏదైనా చిన్న వేషం అడిగి అప్పుడప్పుడు వెండితెర మీద కనిపిస్తూ ఉంటాడు. ఇదంతా పక్కన పెడితే కోటా శ్రీనివాసరావు ముక్కుసూటి మనిషి. మనసులో ఏదుంటే అది నిర్మొహమాటంగా ఆనిస్తూ ఉంటాడు. తన భావాలను ఎలాంటి ఫిల్టర్ లేకుండా బయటపెట్టడం లో ఈయన దిట్ట. అందువల్ల కోటా శ్రీనివాసరావు వ్యాఖ్యలు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున వివాదాలకు దారి తీస్తూ ఉంటాయి. ఒకానొక సందర్భంలో మెగా బ్రదర్ నాగబాబు కోటాశ్రీనివాస రావు ని ఇష్టమొచ్చినట్టు ఒక ఇంటర్వ్యూ లో తిట్టిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కోటా శ్రీనివాస రావు వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడం మానలేదు. రీసెంట్ గా ఒక ప్రముఖ ఛానల్ కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లో బాహుబలి సినిమా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఆయన మాట్లాడుతూ ‘బాహుబలి సినిమా విడుదలైనప్పుడు అందరూ తెగ పొగిడారు. అంతర్జాతీయ స్థాయిలో ఆ చిత్రం రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కించుకుంది. కానీ ఈరోజు ఆ సినిమా గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారా. అదే అప్పుడెప్పుడో వచ్చిన ‘పాతాళ భైరవి’ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నారు. అలాంటి స్థాయి సినిమాలు నేటి తరం డైరెక్టర్స్ తియ్యలేరు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక హీరోల విషయానికి వస్తే నేటి తరం లో ఎన్టీఆర్ లాంటి నటుడు మరొకరు లేరు, అతని నటన కానీ, డ్యాన్స్ కానీ భేష్ అంటూ పొగడ్తలతో ముంచి ఎత్తాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలపై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తుంది. కోటా శ్రీనివాసరావు ఇక్కడ కూడా తన సామాజిక వర్గ భావాన్ని చూపిస్తున్నాడని, పాతాళ భైరవి ముమ్మాటికీ ఆల్ టైం క్లాసిక్, అందులో ఎలాంటి సందేహం లేదని, కానీ ఆ సినిమాని లేపడం కోసం బాహుబలి సినిమాని తక్కువ చెయ్యాల్సిన అవసరం లేదని, బాహుబలి సినిమా కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ ని మాత్రమే కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచం నలుమూలలకు విస్తరిమ్పచేసిందని, కోటా గారు ఈ విషయాన్నీ గుర్తించుకోవాలి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.