Prabhas: పాన్ ఇండియా హీరోల లిస్ట్ లోకి ఎంత మంది హీరోలు వచ్చి చేరినా.. నెంబర్ వన్ ‘పాన్ ఇండియా హీరో’ అంటే ప్రభాస్ ఒక్కడే. స్టార్ డమ్ లోనే కాదు, మార్కెట్ పరంగా కూడా ప్రభాస్ కి తిరుగులేదు. ఆ స్థాయిలోనే ఆ విధంగానే ప్రభాస్ కూడా భారీ ప్రాజెక్ట్స్ కమిట్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఓ పోలీస్ డ్రామా చేయబోతున్నాడు. నిజానికి ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఫుల్ లెంగ్త్ ఖాకీ డ్రెస్ లో ప్రభాస్ ను చూడాలని కోరుకుంటున్నారు. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి పోలీస్ యూనిఫామ్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది.

అందుకే అభిమానులు ప్రభాస్ ను పవర్ ఫుల్ పాత్ర చేయమని పలు సందర్భాల్లో అనేకసార్లు రకరకాలుగా విజ్ఞప్తులు చేసుకున్నారు. అయితే ప్రభాస్ అభిమానుల కోరిక తీరబోతున్న సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించబోతున్నాడు. పైగా ప్రభాస్ ఈ సినిమాలో ఒక స్పై గా కూడా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ది డబుల్ యాక్షన్ . ఒక క్యారెక్టర్ పోలీస్ అయితే, మరో క్యారెక్టర్ స్పై. మరి ఈ డబుల్ యాక్షన్ లో ప్రభాస్ ఓ రేంజ్ యాక్షన్ చేస్తాడట.
ఐతే, ‘స్పిరిట్’ పేరుతో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌ను తీసుకోవాలని సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేస్తున్నాడు. కత్రీనా కైఫ్ ను ప్రభాస్ సరసన సెట్ చేయడానికి సందీప్ రెడ్డి ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాడు. మరి ముదురు భామ కత్రీనా కైఫ్ ను ‘స్పిరిట్’ సినిమాలో నిజంగానానే తీసుకుంటారా ? లేదా ? అనేది చూడాలి.

అయితే, కత్రీనా కైఫ్ ప్రస్తుతం ఫామ్ లో లేదు. పైగా ఆమె పెళ్లి కూడా చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇలాంటి సందర్భంలో మళ్ళీ కత్రీనా కైఫ్ ను హీరోయిన్ గా తీసుకోవడం, అదీ ప్రభాస్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా తీసుకోవడం సాహసమే. అయితే.. ప్రభాస్ కి కత్రీనా కైఫ్ అయితేనే బాగుంటుందని సందీప్ ఫీల్ అవుతున్నాడు. తాను రాసుకున్న పాత్రకు కత్రీనా కైఫ్ అయితేనే బాగుంటుందట.
ప్రస్తుతం సందీప్ రెడ్డి, హీరో రణబీర్ కపూర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే ప్రభాస్ సినిమా స్టార్ట్ కానుంది. ప్రభాస్ కు ఇది ప్రతిష్టాత్మక 25వ చిత్రం. కాబట్టి ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో స్పెషల్ ఫిల్మ్ గా నిలిచిపోయేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అన్నట్టు ప్రభాస్ గతంలో సాహో సినిమాలో ఏజెంట్ గా నటించాడు. అలాగే ఏక్ నిరంజన్ లో పోలీసులకు సహకరించే బౌంటీ హంటర్ గా నటించాడు. కానీ మొదటిసారి ఈ సినిమాలో పోలీస్ గా స్పైగా నటించబోతున్నాడు.