Puspha Part 3: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో ‘అల్లు అర్జున్’ హీరోగా వచ్చిన ‘పుష్ప’ ఘన విజయం సాధించింది. ‘ఐకాన్ స్టార్’గా ప్రమోట్ అవ్వడానికి రిస్క్ చేసి మరీ నేషనల్ రేంజ్ లో బన్నీ సూపర్ హిట్ కొట్టాడు. పైగా పుష్ప చిత్రం అభిమానులను, సినీ ప్రముఖులనే కాదు, రాజకీయ నాయకులను కూడా బాగా మెప్పించింది. ప్రస్తుతం వస్తున్న ‘పుష్ప 2’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే, సెకండ్ పార్ట్ తో ‘పుష్ప’ కథకి ముగింపు పలుకుతారని అంతా భావించారు. కానీ, ఇప్పుడు ‘పుష్ప 3’ కూడా రాబోతుంది. ఈ విషయాన్ని తాజాగా ఫహద్ ఫాజిల్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘పుష్ప 3’కీ కావాల్సినంత మెటీరియల్ సుకుమార్ దగ్గర ఉందని’ ఫహద్ లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అయితే, పుష్ప 3లో మరో హీరో ఉంటాడని టాక్ నడుస్తోంది.

సుకుమార్ – సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కలయికలో సినిమా వస్తోంది అనగానే.. అదిరిపోయే కాంబినేషన్ సెట్ చేశారు అంటూ చాలా పాజిటివ్ కామెంట్స్ వినిపించాయి అయితే, ఆ తర్వాత వీళ్ళ సినిమా పై ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. అయితే, ఈ రౌడీ హీరో తన తర్వాత సినిమా.. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తోనే ఉంటుందని.. సుకుమార్ పుట్టినరోజున నాడు విజయ్ దేవరకొండ సుక్కుకి విషెస్ తెలుపుతూ.. ఒక మెసేజ్ చేశాడు. “మీతో నేను సినిమా చేసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను సర్. 2021 ది రైజ్, 2022 ది రూల్, 2023 ది ర్యాంపేజ్” అంటూ విజయ్ దేవరకొండ రాసుకొచ్చాడు. కాగా ఈ సుక్కు – విజయ్ సినిమా పేరు ‘పుష్ప: ది ర్యాంపేజ్’ అని టాక్ నడుస్తోంది.

ఇక విజయ్ దేవరకొండ మాత్రం చాలా తెలివిగా తనను తానూ పాన్ ఇండియా స్టార్ గా ప్రమోట్ చేసుకోవడంలో పూర్తి సక్సెస్ అయ్యాడు. స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసి తన మార్కెట్ పరిధిని కూడా రెట్టింపు చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. ఇక ఈ సెన్సేషనల్ హీరో – క్రియేటివ్ డైరెక్టర్ కలయికలో రానున్న క్రేజీ ప్రాజెక్ట్ తో కేదార్ సెలగంశెట్టి అనే యువ నిర్మాత ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు. తన సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘పుష్ప 2’ ఈ ఏడాది వరకు ఉంటుంది. అలాగే సుకుమార్ స్క్రిప్ట్ రాయడానికి ఎంత లేదన్నా ఆరు నెలల టైం తీసుకుంటాడు.
కాబట్టి పుష్ప 3 వచ్చే ఏడాది సమ్మర్ లో మొదలుపెట్టాలని సుక్కు ప్లాన్ చేస్తున్నాడు. ఏది ఏమైనా ఈ క్రేజీ కాంబినేషన్ లో పుష్ప 3 వస్తే.. పాన్ ఇండియా వైడ్ గా ఈ చిత్రం పై భారీ హైప్ ఉంటుంది.
