Ileana: గోవా బ్యూటీ ఇలియానా డీక్రజ్ మరోసారి ఇన్ స్టాగ్రామ్ లో మంటలు పుట్టించింది. “ఫైర్” ఇమోజీలతో బికినీ సెల్ఫీ షేర్ చేసి మొత్తానికి కాక రేపింది. ఇలియానా ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ లో సరదాగా గడుపుతుంది. కత్రినా కైఫ్, ఆమె భర్త విక్కీ కౌశల్ కొందరు మిత్రులతో కలిసి ఇలియానా మాల్దీవులకు వెళ్ళింది.

ఐతే, తాజాగా తన సోలో బికినీ ఫోటోలు పోస్ట్ చేసింది. బీచ్ లో రిలాక్స్ అవుతూ ఘాటు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ బికినీ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ‘అరె వచ్చేసింది మా అందాల నిధి, అబ్బా ఆ సన్నని నడుము చూడు, అసలు ఇది కదా అందం అంటే..!’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఎందరు హీరోయిన్లు వస్తున్నా.. ఇలియానాను మాత్రం మన సౌత్ జనాలు మర్చిపోలేకపోతున్నారు. అసలు ఇలియానా పేరు తెలియనివారు తెలుగు సినిమా ప్రేమికులుగా ఉండటానికి అనర్హులని ఇలియానా అభిమానులు బలంగా వాదిస్తూ ఉంటారు. ఈ మధ్య ఇలియానా తెలుగు ఫ్యాన్ పేజీలు బాగా యాక్టివ్ అయ్యాయి.
ఒకప్పటి లేత ఇలియానా అందాల ఫోటోలతో పాటు ప్రస్తుతం ఇలియానా ముదురు ఫోజుల ఫోటోలను కూడా ఓ చోటుకు తెచ్చి.. సోషల్ మీడియాలో నెటిజన్ల మనసుకు మంటలు పెడుతున్నారు. దాంతో ఇలియానా ఫోటోలు మళ్లీ వైరల్ అవుతున్నాయి.

ఎంతైనా ఇలియానా తెలుగులోని స్టార్ హీరోల అందరితోనూ ఆడిపాడి హిట్లు కొట్టడంతో పాటు ఘాటు రొమాన్స్ కూడా చేసింది. కాకపోతే, హిందీ సినిమాల పై మోజు పడి.. తెలుగు ప్రేక్షకులకు హ్యాండ్ ఇచ్చింది. అయితే, హిందీ ప్రేక్షకులు మాత్రం ఇలియానాను బి గ్రేడ్ హీరోయిన్ గానే చూశారు.
దాంతో హిందీలో హిట్ అవ్వకుండానే పేడ్ అవుట్ అయిపోయింది. అంతలో ఈ లోపు టాలీవుడ్ లో సైతం ఆమె ఫేడ్ అవుట్ అయింది. మధ్యలో బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ తో బ్రేకప్ అవ్వడం, ఆమెను బాగా ఇబ్బంది పెట్టింది.

అయితే ప్రస్తుతం కత్రీనా కైఫ్ సోదరుడు ‘సెబాస్టియన్ లారెంట్ మిచెల్’తో ఇలియానా లవ్ ట్రాక్ నడుపుతుందట. దీనికి సంబంధించిన ఫొటోలను ఇలియానా తన ఇన్‌స్టా వేదికగా పంచుకోవడంతో ఈ వార్తకు మరింత బలం తోడైంది.
నిజానికి ఇలియానాకి – సెబాస్టియన్ కి మధ్య ఎక్కడా సినిమాల పరంగా కనెక్షనే లేదు. కాబట్టి.. వీరి మధ్య ఉన్న బంధం వ్యక్తిగతమైనదే. అయినా ‘ఎలాంటి సంబంధం లేకుండా ఇలియానా బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఎందుకు పాల్గొంటుంది ?’ అంటూ నెటిజన్లు కూడా చర్చించుకుంటున్నారు.

ఓ పార్టీలో ఇలియానాకి, సెబాస్టియన్ తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ళు ఇద్దరూ సరదాగా కలుసుకున్నారు. గత 6 నెలలుగా మాత్రం ఇద్దరు డేటింగ్ చేస్తున్నారు. సెబాస్టియన్ ఇన్‌స్టా అకౌంట్ ను కూడా గత కొంతకాలంగా ఇలియానా ఫాలో అవుతోంది. మొత్తానికి ఆండ్రూ నీబోన్ స్థానాన్ని సెబాస్టియన్ కవర్ చేసినట్టు ఉన్నాడు. మరి, ఇలియానా సెబాస్టియన్ ను అయినా పెళ్లి చేసుకుంటుందా ? చూడాలి.
Recommended Videos