Anchor Suma Daughter: సుమ కనకాల… ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. రెండు దశాబ్దాలుగా తెలుగులో టాప్ యాంకర్ గా కొనసాగుతుంది. బుల్లితెర షోలు, సినిమా ఈవెంట్స్, స్టార్స్ ఇంటర్వ్యూలు చేస్తూ బిజీగా ఉంటుంది. నటిగా కెరీర్ మొదలు పెట్టిన సుమ అవకాశాలు రాకపోవడంతో యాంకర్ గా మారింది. కేరళ అమ్మాయి అయినప్పటికీ తెలుగు చక్కగా మాట్లాడుతూ అనతి కాలంలోనే స్టార్ యాంకర్ గా ఎదిగింది. కాగా ఇటీవల ఫ్యామిలీతో కలిసి విషు వేడుకలు జరుపుకునేందుకు కేరళ వెళ్లారు సుమ.
సుమ, రాజీవ్ కనకాల వారి పిల్లలు రోషన్, మనస్వినితో పాటు కేరళ లోని స్వస్థలం పాలక్కాడ్ కి వెళ్లారు. మలయాళీ నూతన సంవత్సరం విషు వేడుకలు గ్రాండ్ గా జరుపుకున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో సుమ కనకాల కూతురు మనస్విని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సుమ కూతురి లేటెస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. కేరళ సంప్రదాయ దుస్తుల్లో మనస్విని చాలా అందంగా కనిపిస్తుంది.
గతంలో చాలా బొద్దుగా ఉండే మనస్విని లేటెస్ట్ ఫొటోలో కాస్త స్లిమ్ అయినట్లు కనిపిస్తోంది. సదరు ఫోటోలు చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. సుమ కూతురు భలే అందంగా ఉంది. హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా లాంచ్ అయ్యాడు. బబుల్ గమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
అయితే నల్లగా ఉన్నాడు, వీడు అసలు హీరో మెటీరియల్ కాదు అని కొందరు రోషన్ ట్రోల్ చేశారు. కానీ అద్భుతంగా నటించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు రోషన్ కనకాల. బబుల్ గమ్ సినిమా లో రోషన్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉండగా .. సుమ కనకాల కూతురిని కూడా ఫ్యూచర్ లో హీరోయిన్ గా లాంచ్ చేస్తుందేమో అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి చూడాలి మనస్విని తల్లిలా యాంకర్ అవుతుందో నటి అవుతుందో…