Squid Game: నెట్ ఫ్లిక్స్ లో సంచలన విజయం సాధించిన సిరీస్ లలో ఒకటి ‘స్క్విడ్ గేమ్’. ఈ కొరియన్ వెబ్ సిరీస్ లాక్ డౌన్ సమయం లో విడుదలైంది. మన తెలుగు ఆడియన్స్ కూడా ఎగబడి చూసారు. నెట్ ఫ్లిక్స్ లోనే అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న నెంబర్ 1 వెబ్ సిరీస్ గా నిల్చింది. రీసెంట్ గానే ఈ సిరీస్ కి సంబంధించిన సెకండ్ సీజన్ విడుదలైంది. రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో లేదు. ఎపిసోడ్స్ మొత్తం ఉత్కంఠభరితంగానే ఉన్నప్పటికీ, క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం సరిగా ముగించలేదని ప్రేక్షకులు ఫీల్ అయ్యారు. కథ విషయానికి వస్తే నిరుపేద జీవితాన్ని అనుభవిస్తున్న అమాయక జనాలను, గేమ్స్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు, రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చు అనే ఆశని చూపించి, వాళ్లందరినీ ఎవ్వరూ కనిపెట్టలేని దీవికి తీసుకెళ్లి గేమ్స్ ఆడిస్తారు. ఈ గేమ్స్ లో ఓడిపోయిన వాళ్ళను చంపేస్తారు అనే విషయం తెలియకుండా వీళ్ళందరూ వెళ్తారు.
మొదటి గేమ్ ఆడిన తర్వాత ఓడిపోయిన వాళ్ళని పింక్ కలర్ దుస్తులు వేసుకున్న వాళ్ళు చంపేయడం చూసి అందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని చివరి వరకు గేమ్స్ ఆడుతారు. చివర్లో ఎవరైతే మిగులుతారో వాళ్ళు జీవితం మొత్తం కష్టపడినా సంపాదించలేనంత డబ్బు ని ప్రైజ్ మనీ గా ఇస్తారు. హీరో దానిని గెలుచుకున్న తర్వాత ప్రశాంతంగా ఉండలేదు. ఈ గేమ్స్ నిర్వహిస్తున్న వాళ్ళ అంతు చూసేందుకు సెకండ్ సీజన్ లో వెళ్తాడు. ప్లాన్ ప్రకారం గానే పింక్ కలర్ దుస్తులు వేసుకున్న వాళ్ళని చంపుకుంటూ వాళ్ళ బాస్ దగ్గరకి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ ప్రయత్నం లో హీరో విఫలమై యాజమాన్యం కి దొరుకుతాడు. దొరికిన తర్వాత అతను అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాడా లేదా ఓడిపోయాడా అనేది మూడవ సీజన్ లో చూసి తెలుసుకోవాలి. ఈ సీజన్ ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.
ఇదంతా పక్కన పెడితే ఈ సిరీస్ కేవలం ఒక కల్పిత కథ అని నమ్మితే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది కల్పిత కథ కాదు. ఇది ఒక యదార్థ ఘటన. దక్షిణ కొరియాలో ఈ ఘటన 1970 నుండి 1980 మధ్యలో జరిగింది. అప్పట్లో కొంతమంది జనాలను సమూహాలుగా తీసుకెళ్లి కొన్ని శిబిరాలలో బంధించేవారు. వేలాది మంది జనాలు ఖైదీలు లాగా ఆ శిబిరాల్లో ఉండేవారట. తమ దేశం లో పేదరికం అనేదే లేకుండా చేసేందుకు ఇలాంటి గేమ్స్ ని నిర్వహించేవారట. దీనికోసం పెట్రోలింగ్ టీంని అప్పటి కొరియన్ ప్రభుత్వమే నియమించిందట. అలా అధికారికంగా ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడ్డ ఈ గేమ్స్ లో ఎన్నో వేల మంది ప్రాణాలను వదిలారు. కొంతకాలం క్రితమే ఈ అక్రమాలు బయటపడ్డాయి. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా చూడండి.