Daaku Maharaj: మిగతా సినిమాలకు తమన్ మ్యూజిక్ ఎలా అందించినా నందమూరి బాలకృష్ణ సినిమా కి మాత్రం తన ప్రాణం పెట్టేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘అఖండ’ చిత్రానికి ఆయన అందించిన మ్యూజిక్, రీ రికార్డింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్ థియేట్రికల్ అనుభూతిని ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రారంభం సన్నివేశం నుండి చివరి సన్నివేశం వరకు తమన్ విశ్వరూపం కి థియేటర్స్ లోని స్పీకర్స్ బ్లాస్ట్ అయ్యాయి. కొన్ని చోట్ల స్క్రీన్స్ కూడా కాలిపోయాయి. మళ్ళీ అలాంటి సంఘటనలు నేడు విడుదలైన ‘డాకు మహారాజ్’ చిత్రానికి జరిగింది. నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించగా, తమన్ సంగీతం అందించాడు. పాటలకు రెస్పాన్స్ పెద్దగా రాలేదు. కానీ థియేట్రికల్ ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత తమన్ ఈ చిత్రానికి కూడా తన విశ్వరూపం చూపించేశాడని అర్థమైపోయింది.
నేడు ఈ చిత్రాన్ని చూసిన ఆడియన్స్ కూడా తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించే ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. అదే విధంగా అఖండ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ లో ఏ విధంగా అయితే స్పీకర్లు కాలిపోయాయో, ఈ చిత్రానికి కూడా అదే జరిగింది. రాయలసీమలోని ఆళ్లగడ్డ ప్రాంతంలో ఉన్న రామకృష్ణ థియేటర్ లో ‘డాకు మహారాజ్’ చిత్రాన్ని నేడు ప్రదర్శించారు. ఈ సినిమా రన్నింగ్ సమయంలో స్పీకర్ సౌండ్ ఫ్రీక్వెన్సీ తట్టుకోలేక కాలిపోయాయి. మంటలు చెలరేగాయి. థియేటర్ సిబ్బంది దీనిని గమనించి సినిమాని ఆపేసాడు. ప్రేక్షకులను ఒక 15 నిమిషాల పాటు బయటకి పంపి, మంటలను ఆర్పేసి మళ్ళీ వాళ్ళను లోపలకు పిలిచి సౌండ్ కాస్త తగ్గించి ఈ చిత్రాన్ని ప్లే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం ఈ ఒక్క థియేటర్ లోనే కాదు, రెండు మూడు థియేటర్స్ లో కూడా నేడు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.
థియేటర్స్ లో ఇలాంటివి జరగడం కామన్ , కానీ మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా తమన్ లైవ్ మ్యూజిక్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నప్పుడు స్పీకర్స్ దాని ఫ్రీక్వెన్సీ ని తట్టుకోలేక క్రిందకి పడిపోయాయి. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఎలా వైరల్ అయ్యాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. అంతే కాకుండా ‘స్కంద’ చిత్రానికి కూడా ఒకటి రెండు ప్రదేశాలలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనికి బోయపాటి శ్రీను స్పందిస్తూ నా సినిమాలోని సన్నివేశాలు చాలా హై వోల్టేజ్ తో ఉంటాయి. కాబట్టి నేను మ్యూజిక్ డైరెక్టర్ తో చాలా గట్టిగా కొట్టిస్తాను. వాటిని థియేటర్స్ స్పీకర్స్ తట్టుకోవాలి. అలాంటివి స్పీకర్స్ పెట్టుకోలేకపోతే నేనేమి చేయలేను అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన మాటలు అప్పట్లో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి. ‘గేమ్ చేంజర్’ క్లైమాక్స్ సన్నివేశానికి కూడా దాదాపుగా స్పీకర్లు బద్దలయ్యే రేంజ్ మ్యూజిక్ ఇచ్చాడు కానీ, అదృష్టం కొద్దీ ఎక్కడా స్పీకర్లు బ్లాస్ట్ అవ్వలేదు.