https://oktelugu.com/

Game Changer Movie: ‘గేమ్ చేంజర్’ మేకర్స్ కి రామ్ చరణ్ సీరియస్ వార్నింగ్..అలా చేస్తే ఇంకెప్పుడు మీతో సినిమా చెయ్యను అని హెచ్చరికలు!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద నెగటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కానీ రామ్ చరణ్ కి ఉన్న బాక్స్ ఆఫీస్ స్టామినా కారణంగా ఈ చిత్రానికి ఓపెనింగ్ వసూళ్లు బాగానే వచ్చాయి.

Written By:
  • Vicky
  • , Updated On : January 12, 2025 / 08:13 PM IST
    Follow us on

    Game Changer Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద నెగటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కానీ రామ్ చరణ్ కి ఉన్న బాక్స్ ఆఫీస్ స్టామినా కారణంగా ఈ చిత్రానికి ఓపెనింగ్ వసూళ్లు బాగానే వచ్చాయి. మొదటి రోజు వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టిన ఈ చిత్రం, రెండవ రోజు, అదే విధంగా మూడవ రోజు కూడా డీసెంట్ స్థాయి హోల్డ్ ని కబార్చింది. అయితే నిర్మాతలు కాస్త అత్యుత్సాహానికి పోయి ఈ సినిమాకి మొదటి రోజు 186 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు ఒక పోస్టర్ ని విడుదల చేసారు. ఈ పోస్టర్ పై రోజు మొత్తం దేశమంతటా చర్చించుకున్నారు. ఒక సినిమాకి పది, 20 కోట్లు ఫేక్ చేయడం సహజమే.

    కానీ ఏకంగా 80 కోట్ల రుపాయిలకు పైగా ఫేక్ చేయడం మొట్టమొదటిసారి చూస్తున్నాము అంటూ నిర్మాతలపై, హీరో రామ్ చరణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే సోషల్ మీడియా జరుగుతున్న ఈ చర్చ రామ్ చరణ్ వరకు చేరింది. ఆయన నిర్మాత దిల్ రాజు కి ఫోన్ చేసి, ఏంటి రాజు గారు ఇది, ఇలాంటివి నాకు నచ్చవు అని మీకు తెలుసు కదా. ఈరోజు మిమ్మల్ని ఏమి అనట్లేదు, నా మీదనే కదా విమర్శలు వస్తున్నాయి. దీని కారణంగా సోషల్ మీడియా లో అభిమానులు కొట్లాడుకుంటున్నారు. ఇక నుండైనా ఇవి ఆపేయండి, లేకపోతే జీవితం లో మీతో సినిమాలు చేయను అంటూ వార్నింగ్ ఇచ్చాడట. దీంతో రెండవ రోజు ఎంత వసూళ్లు వచ్చాయి అనే దానిపై పోస్టర్ ని విడుదల చేయలేదు మేకర్స్. రామ్ చరణ్ తీసుకున్న ఈ నిర్ణయానికి సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. కానీ అభిమానులు మాత్రం సంతృప్తి గా లేరు.

    సినిమాకి మార్కెటింగ్ చేయడం అంటే ఇలాగే ఉంటుంది. ఇలాంటివి చూసే కదా , ఇంత కలెక్షన్స్ వస్తున్నాయా, అయితే ఏముందో ఈ సినిమాలో ఒకసారి చూద్దామని ఆడియన్స్ థియేటర్స్ కి కదిలేది అంటూ హీరో రామ్ చరణ్ ని ట్యాగ్ చేసి మండిపడుతున్నారు అభిమానులు. మహేష్ బాబు నటించిన గత రెండు సినిమాలు కమర్షియల్ గా ఫ్లాప్. కానీ ఆ చిత్రాలకు పోస్టర్స్ ద్వారా చేసిన ఇలాంటి పబ్లిసిటీ కారణంగానే, పది నుండి 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు అదనంగా వచ్చాయి. రామ్ చరణ్ అది అర్థం చేసుకోవడం లేదంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి రామ్ చరణ్ ‘రంగస్థలం’ చిత్రం నుండే ఇలాంటివి ప్రోత్సహించను అని బహిరంగంగా చెప్పుకొచ్చాడు. చెప్పిన మాట ప్రకారమే, ఇప్పుడు ఆయన ఆచరించి చూపిస్తున్నాడు. దీనికి బట్టి రామ్ చరణ్ ఎంత నిజాయితీగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చని ట్రేడ్ పండితులు సైతం ఆయన్ని ప్రశంసిస్తున్నారు.