Director Shankar: గేమ్ చేంజర్ సినిమాతో శంకర్ అగ్ని పరీక్ష ను ఎదుర్కోబోతున్నాడా..?

ఇండస్ట్రీ లో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది కామన్.. అయినప్పటికి సక్సెస్ లు ఉన్నవాళ్లకే ఇక్కడ అవకాశాలు ఉంటాయి. వాళ్ళకే ఎక్కువ మంది అభిమానులు ఉంటారు...

Written By: Gopi, Updated On : August 4, 2024 12:34 pm

Director Shankar

Follow us on

Director Shankar: సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు ఎప్పటికప్పుడు వాళ్ళ ఆలోచన శైలిని మార్చుకుంటూ ఇప్పుడున్న జనరేషన్ కి తగ్గట్టుగా సినిమాలు చేస్తేనే వాళ్లకు సక్సెస్ లు దక్కుతాయి. అలా ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా మంచి పేరును సంపాదించుకున్న దర్శకులు సైతం ఇప్పుడు అప్డేట్ అవ్వలేక జనాలకు నచ్చే సినిమాలను తీయలేక ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన శంకర్ లాంటి డైరెక్టర్ కూడా ప్రస్తుతం వరుస ప్లాపులను ఇస్తూ తన అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేస్తున్నాడు. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే భారీ ప్రయోగాలు చేసి సక్సెస్ లను సాధించిన శంకర్ ఇప్పుడు మాత్రం ఆయన మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోతున్నాడు. ఇక రీసెంట్ గా కమల్ హాసన్ హీరోగా వచ్చిన భారతీయుడు 2 సినిమాని కూడా సక్సెస్ గా నిలపడంలో ఆయన పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ ని హీరోగా పెట్టి చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద ఆయన భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా శంకర్ కి ఒక అగ్నిపరీక్ష గా మారిందనే చెప్పాలి. ఈ సినిమాతో సక్సెస్ కొడితేనే ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడు. లేకపోతే మాత్రం ఆయనను పట్టించుకునే నాధుడు ఉండడు అనేది మాత్రం వాస్తవం…ఇక ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వస్తున్న యంగ్ డైరెక్టర్లు సైతం పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ లను కొడుతుంటే మనందరం చెడ్డీలు వేసుకున్న వయసులోనే శంకర్ ఇండస్ట్రీ రికార్డ్ లను బ్రేక్ చేశాడు.

ఇక అలాంటి శంకర్ ఇప్పుడు మాత్రం ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అనేదే అందరి మది లో మెదులుతున్న ప్రశ్న… గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనే దానికంటే శంకర్ ఈ సినిమాను సక్సెస్ ఫుల్ గా నిలుపుతాడా లేదా అనే విషయాలను తెలుసుకోవడానికి చాలామంది ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా ఈ సంవత్సరం ఎండింగ్ లో గాని లేదంటే వచ్చే సంవత్సరం స్టార్టింగ్ లో గాని రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది.

త్రిబుల్ ఆర్ సినిమా వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ రామ్ చరణ్ ఈ ఒక్క సినిమా మీదనే మొత్తం డేట్స్ కేటాయించి ఇన్ని రోజులపాటు ఖాళీగా ఉండడం అనేది ఆయన అభిమానులను కొంతవరకు నిరాశపరిచే విషయమనే చెప్పాలి. ఇక ఇప్పటికైనా శంకర్ భారీ సక్సెస్ ని సాధించి అటు తమిళ్, ఇటు తెలుగు రెండు ఇండస్ట్రీల్లో కూడా స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును తెచ్చుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమా తర్వాత ఆయన కమల్ హాసన్ తో భారతీయుడు 3 సినిమాని కూడా పట్టాలెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక భారతీయుడు 2 సినిమాతో మెప్పించలేకపోయిన కూడా ఇప్పుడు వచ్చే ‘భారతీయుడు 3’ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు…చూడాలి మరి ఈ రెండు సినిమాలతో శంకర్ ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడనేది…