ఎంటర్టైన్మెంట్Sandeep Reddy Vanga : ఆ విషయంలో సందీప్ రెడ్డి వంగ రన్బీర్ కపూర్ మీద...

Sandeep Reddy Vanga : ఆ విషయంలో సందీప్ రెడ్డి వంగ రన్బీర్ కపూర్ మీద కోపం తో ఉన్నాడా..? మరి అనిమల్ పార్క్ సినిమా సంగతేంటి..?

Sandeep Reddy Vanga : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ… అర్జున్ రెడ్డి సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఈయన దాదాపు 30 సంవత్సరాల తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రేక్షకుడు సినిమా చూసే విధానాన్ని, దర్శకులు సినిమా తీసే విధానాన్ని మార్చి కొత్త రకం సినిమాను ప్రేక్షకులకు చూపించి స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈయన చేసే సినిమాల్లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పటికి ప్రేక్షకులను సైడ్ ట్రాక్ వెళ్లకుండా ఎంగేజింగ్ గా కథను చెప్పడంలో మాత్రం ఆయన సక్సెస్ ను సాధించాడు. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరనేది వాస్తవం…ఇక గత సంవత్సరం ఆయన రన్బీర్ కపూర్ తో చేసిన అనిమల్ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో రన్బీర్ కపూర్ 900 కోట్ల కలక్షన్స్ ను రాబట్టడమే కాకుండా తన కెరియర్ లో అదే బిగ్గెస్ట్ సక్సెస్ గా తను సెలబ్రేషన్స్ ని కూడా జరుపుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా అనిమల్ సినిమా మీద బాలీవుడ్ లో ఉన్న కొంతమంది సెలబ్రిటీలు కొన్ని నెగటివ్ కామెంట్స్ అయితే చేశారు. ఇక వాటికి సందీప్ రెడ్డి వంగ తనదైన స్టైల్ లో సమాధానం చెబుతూ వచ్చాడు. ఇక ఇదిలా ఉంటే రన్బీర్ కపూర్ పలు సందర్భాల్లో ఈ సినిమా మీద కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి సెన్సిటివ్ గా సమాధానం చెబుతూ వచ్చాడు.

ఇక దానిపట్ల సందీప్ రెడ్డివంగా రణ్బీర్ కపూర్ మీద కొంతవరకు కోపంతో అయితే ఉన్నాడట. ఎందుకంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు చాలా స్ట్రాంగ్ గా సమాధానం చెప్తేనే వాళ్ళు ఇంకోసారి అడగరనే ఉద్దేశ్యం తో సందీప్ తన వైఖరిని పాటిస్తుంటే రన్బీర్ మాత్రం చాలా కూల్ గా సిచువేషన్ ని డీల్ చేస్తున్నాడు.

దానివల్లే కొంతవరకు రణ్బీర్ కపూర్ మీద సందీప్ వంగ అలిగినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి మధ్య మంచి ర్యాపో అయితే ఉంది. కాబట్టి తొందర్లోనే అనిమల్ పార్క్ సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నాము అంటూ గతంలో కొన్ని కామెంట్లైతే చేశారు. ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా చేస్తున్నాడు.

కాబట్టి ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆనిమల్ పార్క్ సినిమా మీద తన పూర్తి ఫోకస్ ను పెడతాడట… రణ్బీర్ కపూర్ లాంటి స్టార్ హీరోకి ఒక అల్టిమేట్ సక్సెస్ ని ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న దర్శకుడిగా కూడా మంచి పేరును సంపాదించుకున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Sandeep Reddy Vanga: వర్మ చిందులు.. సందీప్ వంగ ఈలలు.. గూస్ బంప్స్ రప్పిస్తున్న వీడియో..

Sandeep Reddy Vanga: ఇప్పటి తరానికి సందీప్ వంగ ఎలాగో , అప్పటి తరానికి రామ్ గోపాల్ వర్మ అలా అన్నమాట. ఇద్దరూ ఒకే స్కూల్ కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ టేకింగ్...

Deepika Padukone : ‘రాకా’ లో దీపికా పదుకొనే సాహసం.. దేశంలో ఏ హీరోయిన్ కూడా ఇలా చేసి ఉండరు..

Deepika Padukone : మన ఇండియా లో హీరోయిన్స్ క్యాటగిరీలో , బిగ్గెస్ట్ లేడీ సూపర్ స్టార్స్ జాబితా తీస్తే , అందులో కచ్చితంగా దీపికా పదుకొనే పేరు ఉంటుంది. చూపులు తిప్పుకోలేని...

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Exit mobile version