Lexi Alford : ఆమె పేరు లెక్సీ ఆల్ఫోర్డ్. వయసు 21 సంవత్సరాలు.. వాస్తవానికి ఈ వయసు ఉన్న అమ్మాయిలు ఉన్నత చదువులు చదువుతారు. పుస్తకాలతో కుస్తీపడతారు. లేకపోతే ఏవైనా ఉద్యోగాలు చేస్తారు. కానీ లెక్సీ వ్యవహార శైలి పూర్తి విభిన్నం. ఆమె ఆలోచనలు కూడా నిత్య నూతనం. అందువల్లే తన జీవితం అందరి లాగా ఉండకూడదని నిర్ణయించుకుంది. మొనాటినీ కి అలవాటు పడద్దని భావించింది. అందువల్లే వినూత్నతకు పెద్దపీట వేసింది. అలాగే సాగిపోయింది.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు ఖండాలు దాటింది. ఇప్పటివరకు 195 దేశాలు చుట్టేసింది. అయితే కేవలం 200 రోజుల్లో, తన ఎలక్ట్రిక్ కారులో ఆమె ఈ ఘనతను సాధించింది.
అనుభూతులను పెంచుకుంది
లెక్సీ చిన్నప్పటినుంచి చాలా చురుకు. కొత్త కొత్త ప్రదేశాలను చూడటం ఆమెకు చాలా ఇష్టం. పైగా ఆమె తల్లిదండ్రులు ట్రావెల్ ఏజెంట్లుగా పనిచేసేవారు. ఫలితంగా చిన్నప్పటినుంచే వాళ్లతో కలిసి ఆమె తిరిగేది. అప్పటినుంచి ఆమెకు ప్రపంచాన్ని చుట్టేసేయాలనే ఆలోచన పెరిగింది. వారి స్ఫూర్తితోనే ఈ ప్రయాణానికి నడుం బిగించింది. ఏకంగా ఆరు ఖండాలు దాటేసింది. 195 దేశాలను విజయవంతంగా చుట్టేసింది. అయితే ఈ ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలను, మరెన్నో అనుభూతులను పెంచుకున్నారని లెక్సీ చెబుతోంది. ” ఒకే విధంగా ఉండడం నాకు నచ్చదు. ఒకే తీరుగా బతకడం ఇష్టం ఉండదు. అందువల్లే వినూత్నను నేను కోరుకుంటాను. కొత్తదనాన్ని ఆస్వాదిస్తాను.. అనుభూతులను పెంచుకుంటాను. జీవితాన్ని ఒకే విధంగా కాకుండా.. అత్యద్భుతంగా తీర్చి దిద్దుకుంటాను. అదే నాకు ఇష్టం.. అందువల్లే ఈ ప్రయాణాన్ని ప్రారంభించాను. కేవలం 200 రోజుల్లోనే ఈ పని చేశాను.. ఇది నాకు గొప్పగా అనిపిస్తోంది.. ఇది ఒక రికార్డు కావడం నిజంగా ఆనందంగా ఉందని” లెక్సీ వ్యాఖ్యానిస్తోంది.
అభినందిస్తున్న గ్లోబల్ మీడియా
లెక్సీ ప్రపంచ యాత్ర పట్ల గ్లోబల్ మీడియా అభినందిస్తోంది..”ఆమె వయసు 21 సంవత్సరాలు మాత్రమే. అయినప్పటికీ ఆమె ఆలోచన గొప్పగా కనిపిస్తోంది. ప్రపంచాన్ని తిరిగి రావాలి అని ఆమె కోరిక వినూత్నమైనది. ఈ కాలపు యువతకు ఆమె ఎంతో ఆదర్శం. నాలుగు గోడల మధ్య కంటే.. నాలుగు దిక్కులలో సంచరించడాన్ని గొప్పగా భావించింది. అందువల్లే ఆమె ఈ ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టింది. ఇలా చేయడం వల్ల ప్రపంచం అంటే ఏమిటో తెలుస్తుంది. సంస్కృతి సంప్రదాయాలను అధ్యయనం చేసే అవకాశం కలుగుతుంది. ఇలాంటివారిని యువత ఆదర్శంగా తీసుకోవాలి. ప్రపంచాన్ని అధ్యయనం చేయాలి. అప్పుడే సాటి మనుషుల గురించి మరింత విస్తృతంగా తెలుస్తుంది. అది మానసిక వికాసానికి.. మానసిక పరిపక్వతకు తోడ్పడుతుందని” గ్లోబల్ మీడియా పేర్కొంటున్నది.