Samantha-Akhil Agent : నాగ చైతన్య మీద సమంత కారాలు మిరియాలు నూరుతుందనేది నిజం. పలు సందర్భాల్లో ఇది రుజువైంది. ఓ ఇంటర్వ్యూలో మీ భర్త అని యాంకర్ సంబోధించగా… మాజీ అంటూ నొక్కి చెప్పింది. మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచాల్సి వస్తే అక్కడ కత్తులు కూడా ఉంచాలంటూ సెన్సేషనల్ కామెంట్ చేసింది. విడిపోయాక సమంత ఇండైరెక్ట్ గా చైతూని టార్గెట్ చేసింది. సోషల్ మీడియాలో అతన్ని విమర్శిస్తూ నిఘూఢమైన పోస్ట్స్ పెడుతూ ఉండేవారు. చైతు-సమంత మధ్య పెద్ద గొడవలే జరిగాయి. ఒకరిపై మరొకరికి విపరీతమైన కోపం ఉందనడానికి సమంత ప్రవర్తన కారణమైంది.

నాలుగేళ్లు అక్కినేని కుటుంబంలో కోడలిగా ఉన్న సమంత మిగతా ఇంటి సభ్యులతో ఎలాంటి రిలేషన్ కలిగి ఉన్నారనేది తెలియదు. అది వారి అంతర్గత విషయం కాబట్టి బయటకు రాదు. అయితే చైతు తమ్ముడు అఖిల్ తో సమంత టచ్ లో ఉన్నారని, వారి మధ్య మంచి రిలేషన్ కొనసాగుతుందని తాజాగా రుజువైంది. అఖిల్ లేటెస్ట్ మూవీ ఏజెంట్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ ప్రోమో కూడా వదిలారు. సదరు ప్రోమో అఖిల్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది.
అఖిల్ పోస్ట్ పై సమంత స్పందించారు. ఏజెంట్ ప్రోమో వీడియోను లైక్ చేసిన సమంత… ‘బీస్ట్ మోడ్ ఆన్’ అంటూ కామెంట్ చేశారు. ఇది అక్కినేని అభిమానుల ఫీజులు ఎగిరిపోయేలా చేసింది. కారణం చైతుకి విడాకులు ఇచ్చిన సమంతను వారు శత్రువుగా చూస్తున్నారు. ఆమెను ఉద్దేశిస్తూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తీరా చూస్తే అక్కినేని ఫ్యామిలీ మెంబర్ అఖిల్ తో ఆమె టచ్ లో ఉన్నారని తేలింది. దీంతో ఎలా స్పందించాలో అర్థం కాక మథనపడుతున్నారు.
కాగా 2018లో అఖిల్ శ్రియా భూపాల్ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ సంబంధం వెనుకున్న సమంత అన్నీ తానై వ్యవహరించారనే టాక్ ఉంది. అఖిల్ కి సంబంధం చూడటం, పెళ్లి చేయాలనే ఆలోచన కూడా ఆమెదేనట. అయితే ఇతర కారణాలతో పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఇక వదినతో అఖిల్ చాలా క్లోజ్ అట. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా మెలిగేవారట. ఈ క్రమంలో సమంత-అఖిల్ ఇంకా టచ్ లో ఉన్నారనిపిస్తుంది. చైతూతో విడాకుల వ్యవహారం వారి స్నేహం పై ప్రభావం చూపలేదని. వారు మంచి మిత్రులుగా కొనసాగుతున్నారన్న స్పష్టత వచ్చింది.