Prostitution in Tollywood : అతడో ప్రముఖ దర్శకుడి వద్ద కీలక అసిస్టెంట్ డైరెక్టర్. చేయాల్సింది సినిమాల పని కానీ.. చేసేది మాత్రం వ్యభిచార దందా.. ఆ దర్శకుడి పేరు చెప్పుకొని సీక్రెట్ గా అవకాశాల పేరుతో వర్ధమాన హీరోయిన్లకు వలవేస్తున్నాడు. హీరోయిన్లు అవుదామని ఉత్తరాది నుంచి వస్తున్న అమ్మాయిలను ఆశ చూపి నిర్మాతలు, బడా బాబుల వద్ద పక్కలోకి పంపుతున్నాడు. ఎన్నో సినిమా కలలతో వస్తున్న అమ్మాయిలను ఇలా వ్యభిచారుణులుగా మారుస్తూ వారి భావి జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారు. పెద్ద పెద్ద ఆఫర్లు వస్తాయని.. ఆ అమ్మాయిల చేత నిర్మాతలు, ఇతర ఫైనాన్సర్ల పక్కలో పడుకోబెడుతున్నాడు.
2017 నుంచి ఆ ప్రముఖ దర్శకుడి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల కూడా ఇతడు పనిచేస్తున్న సినిమా రిలీజ్ అయ్యింది. తాజాగా ఇతడి ఆట కట్టైంది. సినిమా అవకాశాల పేరుతో ఉత్తరాది నుంచి అమ్మాయిలను పిలిపించి వ్యభిచారం నిర్వహిస్తున్న ఆ అసిస్టెంట్ అడ్డంగా దొరికిపోయాడు. ఇతగాడి యవ్వరాలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.
తాజాగా హైదరాబాద్ లోని కొందరు ప్రముఖులకు ఇతగాడు ఉత్తరాది నుంచి సినిమా అవకాశాల కోసం వచ్చిన యువతులను సరఫరా చేశాడు. పెద్ద వారి కోరికలు తీరిస్తే మీకు సినిమా అవకాశాలు.. కెరీర్ మలుపు తిరుగుతుందని ఆశపెట్టి పంపించాడు.
అయితే పోలీసులకు ఉప్పందింది.. ఓ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి మరీ ఈ అసిస్టెంట్ డైరెక్టర్ తోపాటు మరో ‘కుమార్’ను అరెస్ట్ చేశారు. వీరి చెర నుంచి ఆ యువతులను విడిపించారు.రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
అయితే ఇతగాడు సరఫరా చేసిన ఆ ప్రముఖుల పేర్లు మాత్రం ఇందులో రాలేదు. వాళ్లు నిర్మాతలా? సినీ ప్రముఖలా? అన్నది బయటపడలేదు. దీంతో ఈ వ్యవహారంలో పెద్ద తలకాయలు భారీగా డబ్బులు ముట్టచెప్పి తప్పించుకున్నారని.. ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ను బుక్ చేశారని సమాచారం.