RRR: తెలుగు సినిమా అనగానే నేడు ‘పాన్ ఇండియా’ అనే ముద్ర పడిపోయింది. నేడు పుష్ప సినిమాకి ఇతర భాషల్లో కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి అంటే.. దానికి కారణం తెలుగు సినిమా అనే బ్రాండ్ కూడా. అయితే, మన తెలుగు సినిమాల పై మనవాళ్ళకే ఎందుకో చిన్నచూపు ఉంటుంది. దానికి కారణం కూడా ఉంది లేండి. తెలుగులో ఎక్కువగా చెత్త సినిమాలే వస్తాయి అని అసంతృప్తి. కానీ, చేతకాని తనం ఉన్నచోటే కదా గొప్పతనానికి విలువ.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఏడాదికి 220 సినిమాల వరకూ రిలీజ్ అవుతున్నాయి. వీటిల్లో 95 శాతం ప్లాప్ సినిమాలే. కావొచ్చు. కానీ, కొన్ని తెలుగు సినిమాలకు అంతర్జాతీయ స్థాయి ఉంది. ఆ మాటకొస్తే.. గతం నుండి ఇప్పటి వరకు చూసుకుంటే.. తెలుగు సినిమా లు అంతర్జాతీయ స్థాయి సినిమా పురస్కారాలు అందుకుని తెలుగు తనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి.
మరి ఆ సినిమాలేంటో చూద్దామా. 1933 లో వేమురి గగ్గయ్య ప్రధాన పాత్రలో వచ్చిన ‘సావిత్రి’ అనే తెలుగు సినిమా వెనీస్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో గౌరవ డిప్లమోను దక్కించుకుంది. అలాగే ‘నర్తనశాల’ సినిమా ఇండోనేషియా రాజధాని జకార్తా లో జరిగిన ‘ఆఫ్రో ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్’లో బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్ అవార్డును సొంతం చేసుకుంది.
ఇక మన శంకరాభరణం చిత్రానికి ఫ్రాన్స్‌లో జరిగిన బేసన్‌కాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రైజ్ ఆఫ్ ది పబ్లిక్ పురస్కారం అందించారు. అలాగే రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఈగ సినిమాకు ఇంటర్ నేషనల్ స్థాయిలో బెస్ట్ ఫిల్మ్ టు వాచ్ అనే అవార్డు వచ్చింది.
Also Read: ANR: నా వల్ల ఎదిగింది, నాకే ఇవ్వరా ?, బాధను దిగమింగుకున్న ఏఎన్నార్ !
త్వరలో రాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా ఏదొక అంతర్జాతీయ స్థాయి అవార్డు వస్తోందని సినీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. మరి వస్తే.. మరోసారి తెలుగు సినిమా స్థాయి ఏమిటో చాటి చెప్పినట్టు అవుతుంది.
Also Read: Bala Krishna: బాలకృష్ణ – గోపిచంద్ సినిమాలో ముఖ్య పాత్ర చేయనున్న… వరలక్ష్మి శరత్ కుమార్