https://oktelugu.com/

Spider Man Movie: ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై సత్తా చాటుతున్న… స్పైడర్ మ్యాన్

Spider Man Movie: భారతీయ బాక్సాఫీస్‌ను హాలీవుడ్ సినిమాలు కొల్లగొట్టడం ఎప్పటి నుంచో జరుగుతున్నదే. ముఖ్యంగా మార్వెల్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, జేమ్స్ బాండ్ తరహా చిత్రాలకు ఇక్కడ క్రేజ్ బాగా ఉంది. రెండేళ్ల కిందట ‘ఎవెంజర్స్: ఎండ్ గేమ్’ సినిమా రిలీజైనపుడు ఏ స్థాయి హంగామా నెలకొందరో అందరూ చూశారు. ఇండియాలో రిలీజయ్యే పెద్ద సినిమాలకు దీటుగా ఆ చిత్రానికి అడ్వాన్ బుకింగ్స్ జరిగాయి. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి ప్రభావం చూపిస్తున్నది ‘స్పైడర్ […]

Written By: , Updated On : December 17, 2021 / 06:25 PM IST
Follow us on

Spider Man Movie: భారతీయ బాక్సాఫీస్‌ను హాలీవుడ్ సినిమాలు కొల్లగొట్టడం ఎప్పటి నుంచో జరుగుతున్నదే. ముఖ్యంగా మార్వెల్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, జేమ్స్ బాండ్ తరహా చిత్రాలకు ఇక్కడ క్రేజ్ బాగా ఉంది. రెండేళ్ల కిందట ‘ఎవెంజర్స్: ఎండ్ గేమ్’ సినిమా రిలీజైనపుడు ఏ స్థాయి హంగామా నెలకొందరో అందరూ చూశారు. ఇండియాలో రిలీజయ్యే పెద్ద సినిమాలకు దీటుగా ఆ చిత్రానికి అడ్వాన్ బుకింగ్స్ జరిగాయి. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి ప్రభావం చూపిస్తున్నది ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ మూవీనే. ఈ గురువారం రిలీజైన ‘స్పైడర్ మ్యాన్’ నో వే హోమ్ భారతీయ బాక్సాఫీస్‌ను దున్నేస్తోంది. తొలి రోజు రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా 3300 స్క్రీన్లలో రిలీజైన ఈ సినిమా… అన్ని చోట్లా హౌస్ ఫుల్ వసూళ్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

Spider Man Movie

spider man no way home movie successfully running with high collections

Also Read: మోక్షజ్ఞ చేత భారీ యాక్షన్ చేయించబోతున్న బాలయ్య !

కాగా తొలి రోజు ‘స్పైడర్ మ్యాన్’ ఇండియాలో ఏకంగా 36 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిందీ చిత్రం. ఇండియాలో ఈ ఏడాదికి ఇదే హెయెస్ట్ గ్రాసర్ అని ప్రత్యేకగా చెప్పాల్సిన పని లేదు. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో.. అజయ్ దేవగణ్, రణ్వీర్ సింగ్ ప్రత్యేక పాత్రలు పోషించిన ‘సూర్యవంశీ’ సినిమా సైతం ఇండియాలో తొలి రోజు 25 కోట్ల లోపే వసూళ్లు రాబట్టింది. అలాంటిది ‘స్పైడర్ మ్యాన్’ దాని కన్నా పది కోట్ల పైగానే వసూళ్లు తెచ్చుకుందంటే బాక్సాఫీస్ దగ్గర దీని ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్వెల్ సినిమాల నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో ఆ అంశాలకు లోటు లేకపోవడం.. విజువల్ ఎఫెక్ట్స్ వారెవా అనిపించడంతో సినిమా పట్ల అందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఒకేసారి ఆ దిగ్గజ దర్శకులిద్దరూ ఆమె కోసం పోటీ పడేవారు !