Ram Charan: శంకర్ మాయలో పడి రామ్ చరణ్ తన కెరియర్ ను వేస్ట్ చేసుకుంటున్నాడా..?

Ram Charan: రామ్ చరణ్ అభిమానులైతే శంకర్ మీద తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా ఇంకా పూర్తి చేయలేదనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

Written By: Gopi, Updated On : June 10, 2024 11:40 am

Is Ram Charan wasting his career by falling under the delusion of Shankar

Follow us on

Ram Charan: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు శంకర్ అంటే సక్సెస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచేవాడు. కానీ ఈ మధ్య కొన్ని సంవత్సరాల నుంచి ఆయన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. దాంతో ఆయన మార్కెట్ కూడా భారీగా డౌన్ అయిందనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన రామ్ చరణ్ లాంటి ఒక స్టార్ హీరోతో గేమ్ చేంజర్ అనే సినిమాని స్టార్ట్ చేశాడు.

అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న అప్డేట్లను ఇస్తున్నారు. తప్ప ఈ సినిమా నుంచి టీజర్ గాని, గ్లింప్స్ గానీ ఏది రిలీజ్ అయితే చేయడం లేదు. మరి మొత్తానికైతే ఈ సినిమా విషయంలో ఆయన ఎలా ఆలోచిస్తున్నాడు అనేది కూడా ఎవరికి అంతుచిక్కడం లేదు. ఇక ఇప్పటికే రామ్ చరణ్ అభిమానులైతే శంకర్ మీద తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా ఇంకా పూర్తి చేయలేదనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

Also Read: Pushpa 2: పుష్ప 2 మీద కొనసాగుతున్న నెగిటివ్ ప్రచారం…కారణం ఏంటంటే..?

ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో తొందర్లోనే పాల్గొనబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూట్ ఇంకా 20% బ్యాలెన్స్ ఉందట. మరి ఈ షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు. అలాగే రామ్ చరణ్ పార్ట్ ను తొందరగా కంప్లీట్ చేసి అతన్ని సినిమా నుంచి బయటికి పంపించేస్తే ఆయన బుచ్చిబాబు సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు కదా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Also Read: Ram Pothineni: జగన్ నీ మీద కుట్ర జరుగుతుంది… సంచలనం రేపుతున్న హీరో రామ్ పోతినేని పోస్ట్!

కానీ శంకర్ వాలకం చూస్తుంటే ఇప్పుడప్పుడే రామ్ చరణ్ ను బయటికి పంపించేలా కనిపించడం లేదు. ఇక శంకర్ ఈ సినిమాని చెక్కుతూనే ఉన్నాడు. అలాగే రామ్ చరణ్ కూడా ఈ సినిమా మీద దాదాపు మూడు సంవత్సరాల నుంచి డేట్స్ కేటాయిస్తూ వస్తున్నాడు. ఇక ఈ సినిమా ఎంతటి సక్సెస్ సాధిస్తుంది అనే విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమా వల్ల రామ్ చరణ్ మాత్రం శంకర్ మాయలో పడి తన పీక్ టైమ్ ని వేస్ట్ చేసుకుంటున్నాడని మరి కొంతమంది సినీ విమర్శకులు సైతం విమర్శిస్తున్నారు…