Prashant Neel and NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఆయనను స్టార్ హీరోగా నిలబెట్టడమే కాకుండా ‘మ్యాన్ అఫ్ ది మాసేస్ గా కూడా మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. మరి ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక రీసెంట్ గా కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ‘దేవర ‘ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాను చేయడమే కాకుండా ఈ సినిమాతో భారీ విజయాన్ని కూడా అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాతో దాదాపు 2000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ అంటే భారీ వైవిధ్యమైన కథాంశాలకు పెట్టింది పేరుగా మారిపోయాడు. డార్క్ మోడ్ లో సినిమాలను చేస్తూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని మెప్పించగలిగే కెపాసిటి ఆయన సొంతం…
అలాంటి దర్శకుడి చేతిలో ఎన్టీఆర్ ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఈ సినిమా అటు ఎన్టీఆర్ కెరియర్ కి, ఇటు ప్రశాంత్ నీల్ కెరీర్ కి కూడా ఈ సినిమా చాలావరకు హెల్ప్ అవ్వబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి చాలా ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది.
ఇక పాన్ ఇండియాలో కూడా ఆయన సినిమాలకు మంచి గిరాకీ ఉంది. ఎట్టకేలకు ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాలతో పాన్ ఇండియాలో స్టార్ డమ్ ని సంపాదించుకొని తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక తన సమకాలీన హీరోలందరూ వందల, వేల కోట్ల కలెక్షన్లను రాబడుతుంటే ఆయన మాత్రం ఇంకా 500 కోట్ల కలెక్షన్ల దగ్గరే ఆగిపోయాడు. కాబట్టి ఈ సినిమాతో 2000 కోట్ల మార్కు టార్గెట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫాదర్ క్యారెక్టర్ లో రజనీకాంత్ నటించబోతున్నాడనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది.
నిజానికి రజనీకాంత్ ఎన్టీఆర్ లకు జర్మనీలో చాలా మంచి మార్కెట్ అయితే ఉంది. ఇక ఈ సినిమా అక్కడ కూడా భారీ పెను ప్రభంజనాలను సృష్టిస్తుందనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి రజినీకాంత్ ఈ సినిమాలో నటిస్తున్నాడా? లేదా అనే దానిమీద ప్రశాంత్ నీల్ ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుందనే చెప్పాలి…