https://oktelugu.com/

Sankranti Anakanam : ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమా ఆ రెండు సినిమాలకు కాపీ గా వస్తుందా..? ఓరీని అనిల్ అది ఇది సేమ్ కథ కదయ్యా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ల హవా ఎక్కువగా కొనసాగుతుంది. స్టార్ హీరోలందరూ కమర్షియల్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తూ ఉండడం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : January 11, 2025 / 02:46 PM IST

    Sankranti Anakanam

    Follow us on

    Sankranti Anakanam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ల హవా ఎక్కువగా కొనసాగుతుంది.
    స్టార్ హీరోలందరూ కమర్షియల్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తూ ఉండడం విశేషం… ఇక వైవిధ్యభరితమైన సినిమాలు చేసే దర్శకులు మీడియం రేంజ్ హీరోలకే పరిమితమవుతున్నారు…కానీ కమర్షియల్ సినిమాలను చేసే అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు మాత్రం స్టార్ హీరోలతో సినిమాలను చేస్తున్నాడు…

    అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటివరకు ఆయన చేసిన 7 సినిమాలు మంచి విజయాలను సాధించాయి. మొదటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎక్కడ తడబడకుండా మంచి విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇక బాలయ్య బాబుతో ‘భగవంత్ కేసరి’ సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్న తర్వాత ఆయన వెంకటేష్ తో చేస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలవబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి వస్తున్న ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక మంచి సినిమాగా నిలవబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో అనిల్ రావిపూడి తన మార్కు ను మరోసారి జనానికి చూపించబోతున్నాడు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందంటూ సినిమా మేకర్స్ నుంచి భారీ వార్తలైతే వస్తున్నాయి… ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా ఒక రెండు సూపర్ హిట్ సినిమాలను కలిపి తీసినట్టుగా తెలుస్తోంది. ఒకప్పుడు వెంకటేష్ హీరోగా వచ్చిన ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ అనే సినిమాలోని సోల్ పాయింట్ పట్టుకొని ఈ సినిమాని తెరకెక్కించారట.

    ఇక అనిల్ రావిపూడి చేసిన ‘ఎఫ్ 3’ సినిమాలోని ఒక కిడ్నాప్ డ్రామాని వాడుకుంటూ ఈ సినిమాని తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ రెండు సినిమాల సమాహారమే ఈ సినిమా చేయడానికి కారణమని తెలుస్తుంది. అయితే అనిల్ రావిపూడి ఇంతకు ముందు చేసిన సినిమాలన్నీ కూడా ఇతర తెలుగు సినిమాల నుంచి స్ఫూర్తి పొందినవే కావడం విశేషం…

    ఆయన మొదటి నుంచి చేసిన సినిమా కథలన్నీ ఇతర సినిమాల కథల మాదిరిగా ఉన్నప్పటికి ట్రీట్మెంట్ విషయంలో తను చాలా జాగ్రత్తగా తీసుకుంటానని చెబుతూ వస్తున్నాడు. ఇక దానివల్లే ఆయన సినిమాలు కొంచెం కొత్తగా కనిపించడమే కాకుండా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయని చాలామంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

    అయితే ఒక వర్గం ప్రేక్షకులను ఈ సినిమాలు అలరించినప్పటికి ఇంకొక వర్గం ప్రేక్షకులను ఈ సినిమాలు ఏ మాత్రం ఆదరించలేకపోవడం విశేష. ఈయన నుంచి వచ్చే సినిమాలు క్రింజు కామెడీగా తెరకెక్కుతూ ఉంటాయని వాటిని చూస్తున్న ప్రేక్షకులు నవ్వాల వద్దా అనే సందిగ్ధ పరిస్థితిలో ఉంటాడు. ఆ సీన్లు గాని ఆ డైలాగులు గాని ఇంతకుముందు ఎక్కడో విన్నట్టుగానే ఉంటాయి అంటూ కొంతమంది కొన్ని విమర్శలైతే చేస్తున్నారు….