https://oktelugu.com/

Silk Smitha: సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకోవడానికి రజినీకాంత్ కూడా ఒక కారణమేనా..? ఆశ్చర్యపరుస్తున్న సంచలన నిజాలు!

2011 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో ఎన్నో నిజాలను దాచిపెట్టేసారు అనేది వాస్తవం. పూర్తి వివరాల్లోకి వెళ్తే అప్పట్లో సూపర్ స్టార్ రజినీకాంత్ కి, సిల్క్ స్మిత కి ప్రేమాయణం నడించింది అనే టాక్ ఉండేది.

Written By:
  • Vicky
  • , Updated On : August 31, 2024 / 05:18 PM IST

    Silk Smitha

    Follow us on

    Silk Smitha: స్టార్ హీరోలకు, హీరోయిన్లకు ఫ్యాన్స్ ఉండడం సర్వసాధారణం. కానీ క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్,ఐటెం సాంగ్స్ చేసే అమ్మాయికి హీరోలను తలదన్నే క్రేజ్, ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన అమ్మాయిని మాత్రం ఈమధ్య కాలంలో మనం ఎప్పుడూ కూడా చూసుండం. కానీ ఆరోజుల్లో సిల్క్ స్మిత కి అలాంటి క్రేజ్ ఉండేది. అప్పటి ఆడియన్స్ సినిమాల్లో సిల్క్ స్మిత స్పెషల్ ఐటెం సాంగ్ చేసింది అనే విషయం తెలిస్తే చాలు, థియేటర్స్ లో కేవలం ఆమెని చూడడానికి గంటల తరబడి క్యూ లైన్స్ లో నిల్చొని చూసేవారు. అలాంటి క్రేజ్ ఉన్న సిల్క్ స్మిత ఎంతో మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన అప్పటి ఆడియన్స్ ని శోకసంద్రంలోకి నెట్టేసింది. ఆమె జీవిత కథని ఆధారంగా చేసుకొని, బాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ విద్యాబాలన్ ‘ది డర్టీ పిక్చర్’ అనే చిత్రం చేసింది.

    2011 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో ఎన్నో నిజాలను దాచిపెట్టేసారు అనేది వాస్తవం. పూర్తి వివరాల్లోకి వెళ్తే అప్పట్లో సూపర్ స్టార్ రజినీకాంత్ కి, సిల్క్ స్మిత కి ప్రేమాయణం నడించింది అనే టాక్ ఉండేది. సిల్క్ స్మిత లేకుంటే రజినీకాంత్ సినిమాలు చేసేవాడు కాదట. ఆయన ప్రతీ సినిమాలోనూ సిల్క్ స్మిత ఉండాల్సిందే అట. అలా వీళ్లిద్దరి జోడి సెన్సేషన్ అవ్వడం, వీళ్ళ మధ్య రొమాన్స్, కెమిస్ట్రీ ని చూసి వీళ్ళు నిజంగానే ప్రేమించుకుంటున్నారు అని అప్పట్లో అందరూ అనుకునేవారు. రజినీకాంత్, సిల్క్ స్మిత కూడా ఈ వార్తలపై నోరు మెదిపి ఖండించకపోవడంతో ముమ్మాటికీ వీళ్ళ మధ్య ఎదో ఉంది అనేది జనాల్లోకి మరింత బలంగా వెళ్ళింది. ఇది ఇలా ఉండగా అప్పటి హీరోల సంపాదన సిల్క్ స్మిత సంపాదనలో సగం కూడా ఉండేది కాదట. అలాంటి రేంజ్ ని ఎంజాయ్ చేసిన ఆమె, నిర్మాతగా మారి రెండు మూడు సినిమాలు చేసింది. దురదృష్టం కొద్దీ ఆ సినిమాలు దారుణమైన ఫ్లాప్స్ అయ్యాయి. దీంతో సిల్క్ స్మిత అప్పుల ఊబిలో కూరుకుపోయి, కటిక పేదరికంలోకి వెళ్ళిపోయింది.

    అలా ప్రతీ రోజు ఆ పేదరికాన్ని అనుభవిస్తూ, మానసిక క్షోభ ని భరిస్తూ, అప్పులు ఇచ్చినోళ్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. అప్పట్లో వినిపించిన మరో వార్త ఏమిటంటే రజినీకాంత్ తో లవ్ బ్రేకప్ అవ్వడంతో సిల్క్ స్మిత వ్యసనాలకు అలవాటు పడిందని, ఆ ట్రాన్స్ లోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని, ఒక విధంగా ఆమె చావుకి రజినీకాంత్ కూడా పరోక్షంగా కారణం అయ్యాడని ఇలా పలు రకాల వార్తలు వినిపించాయి. సుమారుగా 450 కి పైగా సినిమాలు చేసిన సిల్క్ స్మిత చివరి శ్వాస వరకు సినిమాలు చేస్తూనే ఉన్నింది. ఆమె నటించిన చివరి చిత్రం 1996 వ సంవత్సరం లో విడుదలైంది. అదే ఏడాదిలోనే ఆమె చనిపోయింది.