Rajamouli: దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు రాజమౌళి…తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ ను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే రాజమౌళి చేస్తున్న వరుస సినిమాలు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఆయా హీరోల కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలే కావడం విశేషం… ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబు తో చేస్తున్న సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏమి ఇవ్వడం లేదు. ఇక దీంతో దాదాపు 10 నుంచి 12 నెలల పాటు మహేష్ బాబు ఖాళీగానే ఉంటున్నారు. ఈ గ్యాప్ లో మహేష్ బాబు ఒక సినిమా చేసిన కూడా దాదాపు ఆయనకు 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అయితే వచ్చేదని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. మరి రాజమౌళి ఈ సినిమా విషయం ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తున్నాడు. అసలు సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ ని ఇవ్వకుండానే సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు సినిమాని రిలీజ్ చేయబోతున్నారు అనే విషయాలను కూడా ఏవి తెలియజేయకుండా గోప్యంగా ఉంచుతున్నాడు.
దానికి కారణం ఏదైనా అవ్వచ్చు. కానీ మహేష్ బాబు అభిమానులు మాత్రం అప్డేట్ కోసం చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరి వాళ్ళ కోరికను నెరవేర్చడానికైనా రాజమౌళి ఈ సినిమా షూటింగ్ డేట్ చెప్తాడేమో అని చాలా రోజుల నుంచి అభిమానులు కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కానీ రాజమౌళి మాత్రం ఏ అప్డేట్ ఇవ్వడం లేదు.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే రాజమౌళి ఈ సినిమాను క్యాన్సల్ చేసి మరొక సినిమా చేయబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇదే నిజమైతే మాత్రం మహేష్ బాబు అభిమానులు రాజమౌళి మీద విపరీతమైన విమర్శలను చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దాదాపు సంవత్సర కాలం పాటు మహేష్ బాబు ను తన చుట్టూ తిప్పుకొని ఇప్పుడు సినిమా క్యాన్సిల్ చేసి వేరే సినిమా చేస్తే మాత్రం రాజమౌళి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొక తప్పదు. మరి రాజమౌళి అలా చేసేవాడైతే కాదు ఒకసారి కమిట్ అయ్యాడు అంటే ఆ సినిమాని సక్సెస్ ఫుల్ గా తీర్చిదిద్దడంలో ఆయన కీలకపాత్ర వహిస్తాడు.
కానీ ఈ సినిమా మీద ఎలాంటి అప్డేట్ ని ఇవ్వకపోవడంతో చాలామంది సినీ మేధావులు సైతం ఈ సినిమా స్టార్ట్ అవ్వదేమో అనే ఆలోచనలో ఉన్నారు. మరి ఇప్పటికైనా రాజమౌళి ఈ విషయం మీద స్పందిస్తే బాగుంటుందని పలువురు సినీ ప్రముఖులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…