https://oktelugu.com/

Rajamouli and Mahesh Babu : మహేష్ బాబుకి రాజమౌళి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారా..? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..?

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు స్టార్ డైరెక్టర్లుగా ఎదగాలనే ప్రయత్నం అయితే చేస్తు ఉంటారు.

Written By:
  • Gopi
  • , Updated On : January 9, 2025 / 10:21 AM IST

    Rajamouli , Mahesh Babu

    Follow us on

    Rajamouli and Mahesh Babu : సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు స్టార్ డైరెక్టర్లుగా ఎదగాలనే ప్రయత్నం అయితే చేస్తు ఉంటారు. అయితే ఇప్పటికే పాన్ ఇండియాలో స్టార్ట్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి ఇప్పుడు పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా విషయంలో అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మరి ముందుకు సాగుతూ ఉండడం విశేషం…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి… ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఈ సినిమాతో ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించిన సినిమా యూనిట్ నెక్స్ట్ మంత్ నుంచి ఈ సినిమాని రెగ్యులర్ షూట్ కి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా మహేష్ బాబు కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ బాబు చేత మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ని కూడా ఇప్పిస్తున్నారట. ఇప్పటివరకు మేకోవర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుకి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ని ఇప్పిస్తుండటం విశేషం…

    ఇక దానివల్ల ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని చేయడానికి కనీసం మహేష్ బాబుకి మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించిన కొన్ని బేసిక్ టెక్నిక్స్ అయితే తెలియాల్సి ఉందట. దానికోసమే హాలీవుడ్ నుంచి వచ్చిన కొంతమంది స్పెషల్ ట్రైయినర్స్ చేత మహేష్ బాబుకి ఇప్పుడు ట్రైనింగ్ అయితే ఇప్పిస్తున్నారు.

    ఇక బాహుబలి సినిమా సమయంలో ప్రభాస్, రానాల చేత హార్స్ రైడింగ్, కర్ర సాము కత్తి సామూలాంటివి నేర్పించిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుకి కూడా అలాంటివే నేర్పించే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా కోసం మహేష్ బాబును విపరీతంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి రాజమౌళి సినిమా అంటే మామూలు కష్టమైతే ఉండదు. కానీ దానికి మించిన ఫలితం అయితే వస్తుందనే ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని ఎలాంటి కష్టాన్ని అయిన సరే భరిస్తూ ముందుకు సాగిన వాళ్లకు మాత్రం ఇక్కడ మంచి గుర్తింపు లభిస్తుంది.

    అలాగే ఆయన సినిమాల వల్ల భారీ క్రేజ్ కూడా దక్కుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. 1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు 3,000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఒక హిస్టరీ ని క్రియేట్ చేయబోతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది…