Tirumala Stampede: ఏపీలో టిడిపి కూటమి( TDP Alliance ) అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతోంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి పనులు పట్టాలెక్కుతున్నాయి. అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగుతున్నాయి. పనుల వేగవంతానికి అవసరమైన చర్యలు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం( central government) సైతం అన్ని విధాల సహకారం అందిస్తోంది. ఏకంగా బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు( World Bank) నిధులనుంచి సర్దుబాటు చేసింది. ఇంకా అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సైతం తమ వంతు సహకారం ఉంటుందని పార్లమెంట్ లోనే తెలిపింది కేంద్రం. రాష్ట్రానికి రైల్వే, రవాణా ప్రాజెక్టులను సైతం మంజూరు చేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో అభివృద్ధికి సైతం కేంద్రం సహకారం అందిస్తోంది.
* భారీ పెట్టుబడులతో
తాజాగా విశాఖలో( Visakhapatnam) రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో చేపడుతున్న ప్రాజెక్టులను శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ( Narendra Modi). ఒకవైపు పాలన చూస్తూనే అభివృద్ధిపై దృష్టి పెట్టింది కూటమి సర్కార్. అదే సమయంలో సంక్షేమ పథకాలను సైతం అమలు చేస్తోంది. ఫిబ్రవరిలో పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టి.. అభివృద్ధిని మరింత పరుగులు పెట్టించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రజల్లోకి అభివృద్ధి నినాదం అనేది ఇప్పుడిప్పుడే వెళ్తోంది. కానీ అదే సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ సైతం ప్రభావం చూపిస్తున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. నిన్న ఒకేరోజు.. రెండున్నర లక్షల కోట్ల రూపాయల శంకుస్థాపనలు.. సాయంత్రానికి తిరుపతిలో తొక్కిసలాట జరిగిన తీరు మాత్రం పలు అనుమానాలకు తావిస్తోంది.
* తొలి విషాద ఘటన
తిరుమల తిరుపతి దేవస్థానం( Tirumala Tirupati Devasthanam) చరిత్రలోనే తొలి విషాద ఘటన ఇది. టీటీడీ చరిత్రను మసకబార్చే విధంగా ఈ ఘటన జరిగింది. దీని వెనుక విద్రోహ చర్య ఉందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అభివృద్ధి నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లే క్రమంలో.. డైవర్షన్ చేసేందుకు ఇటువంటి ఘటనకు దిగారా అన్నది కూడా ఒక రకమైన అనుమానం. వాస్తవానికి వైసిపి టిడిపి కూటమి ప్రభుత్వంపై ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలను ఇచ్చారు చంద్రబాబు( Chandrababu). అవి అమలు చేయలేక వైసీపీ నేతలపై దాడులు, కేసులు పెడుతున్నారని.. డైవర్షన్ పాలిటిక్స్ కు దిగుతున్నారని వైసిపి ఆరోపణలు చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు అభివృద్ధి జోరుగా జరుగుతున్న తరుణంలో.. ఏపీలో డైవర్షన్ కోసం ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
* అభివృద్ధికి పెద్ద పీట
గత ఐదేళ్ల వైసిపి పాలనలో సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. టిడిపి కూటమి( TDP Alliance ) ప్రభుత్వం మాత్రం అభివృద్ధికి పెద్ద పీట వేస్తోంది. ఇప్పటికే పల్లె పండుగ పేరిట గ్రామాల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఇంకోవైపు రాష్ట్రవ్యాప్తంగా పాడైన రహదారులను బాగు చేసే పనిలో పడింది ప్రభుత్వం. పండుగ నాటికి రోడ్లన్నీ అద్దంలో మెరవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం పై ఒక సానుకూలత ఏర్పడుతోంది. సరిగ్గా ఇదే సమయంలో తిరుపతిలో తొక్కిసలాట జరగడం ఒక అపఖ్యాతిగా మిగలనుంది. ప్రభుత్వం అభివృద్ధి నినాదంతో సానుకూలత తెచ్చుకుంటున్న తరుణంలో.. ఈ ఘటన జరగడం అనుమానాలకు తావిస్తోంది.