Rajamouli : సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన చేసిన పాన్ ఇండియా సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి…ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి ఈ రోజున స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతుండటం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ఏ సినిమా కూడా ఫ్లాప్ కాకపోవడం వల్ల ఆయనకు ఇండియన్ మార్కెట్ లో కూడా భారీ క్రేజ్ అయితే పెరుగుతుంది. ఇక ఆయన చేసిన బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలవడమే కాకుండా ఆయనకంటూ గొప్ప కీర్తిని కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చాలా అవార్డులను కూడా అందుకున్నాడు. ఇక బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఆయన సినిమాల కోసం పడిగాపులు కాస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక త్రిబుల్ ఆర్ సినిమా వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఆయన మరొక సినిమానైతే స్టార్ట్ చేయలేదు. ఇక మహేష్ బాబుతో చేయబోతున్న పాన్ వరల్డ్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే హాలీవుడ్ స్టాండర్డ్స్ తో ఈ సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నాడు.
1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో ఆయన ఎక్కడా కూడా రాజీ పడకుండా ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్లు రాబడుతుందంటూ రాజమౌళి ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న ఈ ప్రయోగం అద్భుతంగా సక్సెస్ ని సాధిస్తుందంటూ ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండటం విశేషం…
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక అడ్వెంచర్ సీక్వెన్స్ ని కూడా రాసుకున్నారట. ఇక దానికోసం మహేష్ బాబు విపరీతంగా కష్టపడాల్సిన అవసరం అయితే ఉంటుందని రాజమౌళి టీమ్ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. ఇక ఈ సినిమా మొత్తానికి ఇది హైలెట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.
ఇక ఈ సినిమాలో దాదాపు 15 నిమిషాల పాటు ఈ అడ్వెంచర్ సీక్వెన్స్ ఉండబోతుందని ఆ సినిమా యూనిట్ నుంచి కొంత సమాచారమైతే అందుతుంది. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడం అంటే ఆషామాషీ కాదు. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ మహేష్ బాబుని ఏ రేంజ్ లో చూపిస్తాడనేది తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమాకి ఎప్పుడు స్టార్ట్ అయి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని మీదనే ప్రేక్షకులకు సర్వత్రా ఆసక్తి నెలకొంది…