Hanu Raghavapudi : సీతారామం సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న హను రాఘవపూడి ఈ సినిమాలో ఒక క్యూట్ లవ్ స్టోరీని చూపించడమే కాకుండా ఇండియన్ ఆర్మీ బ్యాగ్ డ్రాప్ ను కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. దానివల్ల ఆయన ప్రస్తుతం ప్రభాస్ తో కూడా మరోసారి ఆర్మీ బేస్డ్ కథతోనే సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో మెదులుతుంది. హను రాఘవపూడి ఇప్పటి వరకు పెద్ద హీరోతో అయితే సినిమా చేయలేదు. మరి ఈ సినిమాలో ప్రభాస్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను రీసెంట్ గా స్టార్ట్ చేశారు. మరి ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఎట్టకేలకు ఈ సినిమాతో ప్రభాస్ తనకంటూ ఒక మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకుంటారు అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక నాని తో చేయాల్సిన స్టోరీనే ప్రభాస్ తో చేస్తున్నాడు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. మరి ఇప్పటివరకు నాని లాంటి హీరో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా కూడా చేయలేదు. దాంతో హను రాఘవ పూడి ఈ కథ వినిపించారట. నాని కొంచెం బిజీగా ఉండడం అలాగే సీతా రామం సినిమాతో సక్సెస్ సాధించడం తో ప్రభాస్ మంచి ఆఫర్ వచ్చింది. దాంతో ఇదే కథని ప్రభాస్ కి చెప్పి దాన్ని ఎక్స్టెండ్ చేసి ఈ సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి మొత్తానికైతే నాని కోసం రాసుకున్న కథలో ప్రభాస్ ఇముడుతాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పటికే ప్రభాస్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ స్టోరీలైతే ఎప్పుడు చేయలేదు. కాబట్టి ఈ సినిమా అతనికి చాలా కొత్తగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈ సినిమాతో ఆయన సక్సెస్ ని సాధిస్తే వరుసగా మూడు విజయాలను సాధించిన హీరోగా మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంటాడు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిమీద క్లారిటీ లేదు. కానీ మొత్తానికైతే షూటింగ్ మాత్రం శరవేగంగా జరపాలనే ఉద్దేశ్యంతో హను రాఘవ పూడి ఇప్పుడు చాలా ఫాస్ట్ గా ఈ సినిమాని కంప్లీట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక మొత్తానికైతే తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఆయన ఇప్పుడు సక్సెస్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధిస్తే మాత్రం హను రాఘవపూడి మాత్రం భారీ సక్సెస్ ని సాధించిన పాన్ ఇండియా దర్శకుడి గా గుర్తింపును సంపాదించుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…