బిగ్ బాస్ పుణ్యమా అంటా కలిసిన ప్రేమ జంటల్లో తెలుగు యంగ్ బ్యూటీ ‘పునర్నవి భూపాలం’ – సింగర్ రాహుల్ సిప్లిగంజ్’ జంట కూడా ఒకటి. పున్ను అంటూ తెలుగు కుర్రాళ్ళు ముద్దుగా పిలుచుకునే ఈ పాప.. మనోడోతో చాల దూరం వెళ్లిందని.. ఏకంగా ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఆ మధ్య వార్తలు బాగా వినిపించాయి. దీనికితోడు పాపకి కాస్త టెక్కు కూడా ఎక్కువే. బిగ్ బాస్ షో పుణ్యమా అని రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంతవరకూ ఈ బ్యూటీ బాగానే గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ గుర్తింపు ఏదో తనకు పెద్ద స్టార్ స్టేటస్ ను తెచ్చినట్టు, తానొక స్టార్ హీరోయిన్ అయిపోయినట్టు ఫీల్ అయిపోయి మొత్తానికి రాహుల్ కి హ్యాండ్ ఇచ్చి మరో కుర్ర యాక్టర్ తో ప్రేమ వ్యవహారం నడుపుతుందట.
Also Read: బాలీవుడ్లోకి ‘రేసుగుర్రం’.. పరుగు పెట్టనుందా?
ఇక పునర్నవి వదిలేసాకా ఐష్ రెడ్డితో రాహుల్ డేటింగ్ షురూ చేసినట్టు ఉన్నాడు. తాజాగా రాహుల్ రీసెంట్ ఇన్ స్టాగ్రామ్ ఫోటోలు చూస్తుంటే… ఐష్ రెడ్డితో రాహుల్ ప్రేమ పాఠాలు ఫుల్ క్రేజ్ తో సాగుతునట్లు అర్ధమవుతుంది. బిగ్ బాస్ 3” టైటిల్ విన్నర్ గా పాపులరైన రాహుల్ సిప్లిగంజ్ మంచి సింగరే.. కాదనలేం.. తనకు ఉన్న ఆ క్రేజ్ ను మనోడు అమ్మాయిల ముందు చూపించి.. ట్రాక్ తప్పుతున్నాడేమో అని నెటిజన్లు రాహుల్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఐతే, తనకి పునర్నవితో ఎలాంటి ప్రేమ బంధం లేదని… అలాగే ఇటు ఐష్ రెడ్డితోనూ డేటింగ్ లో లేను అంటున్నాడు రాహుల్. “వాళ్ళు ఇద్దరూ తనకు మంచి ఫ్రెండ్స్ అని, నా గ్యాంగ్ లో వాళ్ళు మెంబర్స్ అని… వారితో లంచ్, డిన్నర్ కి వెళ్తాను. అంతే అంటూ రాహుల్ రీసెంట్ గా క్లారిఫికేషన్ ఇచ్చినా.. ఎవ్వరూ నమ్మట్లేదట.
Also Read: బిగ్ బాస్-4: సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన మొనాల్..!
ఇక రీసెంట్ గా హైదరాబాద్ నగరం పై రాహుల్ చేసిన పాటని మంత్రి కేటీఆర్ మెచ్చుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి మనోడు అటు పాటలతో, ఇటు అమ్మాయిలతో డేటింగ్ చేస్తూ… మొత్తానికి లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. నిజానికి బిగ్ బాస్ లో పాల్గొనకముందు కూడా రాహుల్ పాటలు పాడాడు. అయితే అప్పట్లో అతనికి అంత క్రేజ్ లేదు. ఈ ప్రేమ పుకార్లు అసలే లేవు. ఈ అందమైన భామలతో ఫ్రెండ్సిఫ్ లు లాంటివి కూడా లేవు. కానీ, బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన దగ్గర నుండి మనోడి లైఫ్ స్టైల్ నే మారిపోయింది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్