ఏపీ, తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ప్రారంభమైన ఆ రైలు..?

కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. రైళ్లలో సైతం రిజర్వేషన్ చేయించుకుంటే మాత్రమే ప్రయాణం చేసే అవకాశం ఉండటంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కాదు. బస్సులు తిరుగుతున్నా గతంతో పోలిస్తే ఛార్జీలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రయాణికులు అంత మొత్తంలో ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నారు. అయితే ప్రజలు పడుతున్న […]

Written By: Kusuma Aggunna, Updated On : November 28, 2020 6:07 pm
Follow us on


కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. రైళ్లలో సైతం రిజర్వేషన్ చేయించుకుంటే మాత్రమే ప్రయాణం చేసే అవకాశం ఉండటంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కాదు. బస్సులు తిరుగుతున్నా గతంతో పోలిస్తే ఛార్జీలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రయాణికులు అంత మొత్తంలో ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నారు.

అయితే ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెంచుకుని రైల్వే శాఖ రైలు సర్వీసులను అంతకంతకూ పెంచుకుంటూ వస్తోంది. రైల్వే శాఖ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం నుంచి షిరిడీకి వెళ్లే రైలు సర్వీసులు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది. రైల్వే శాఖ అధికారుల నుంచి ఈ మేరకు కీలక ప్రకటన వెలువడింది.

మరోవైపు దీపావళి పండుగ సందర్భంగా నడుపుతున్న ప్రత్యేక రైళ్లు మరికొన్ని రోజులు కొనసాగించాలని రైల్వే శాఖ భావిస్తోంది. దసరా, దీపావళి పండుగ సందర్భంగా నడుపుతున్న ప్రత్యేక రైళ్లు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నడుస్తాయని రైల్వే శాఖ వెల్లడించింది. అయితే ప్రత్యేక రైళ్లు తిరిగినా రైళ్ల సమయాల్లో మార్పులు ఉంటాయని రైల్వే శాఖ చెబుతోంది. అయ్యప్ప స్వామి భక్తుల కోసం సికింద్రాబాద్‌-త్రివేండ్రం మధ్య రైళ్లను జనవరి 20 వరకు నడుపుతున్నట్టు రైల్వే శాఖ తెలిపింది.

ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైల్వే శాఖ రైళ్లను నడుపుతుండటంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో రైళ్ల సర్వీసులను అందుబాటులోకి తెస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.