Prabhas : కొన్ని సినిమాలు కొంతమంది దర్శకులకు చాలా ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చి పెడతాయి. అందులో తమిళ్ దర్శకుడు అయిన లోకేష్ కనకరాజ్ కి కూడా ‘విక్రమ్ ‘ సినిమా మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టడమే కాకుండా ఆయనకు ఒక భారీ సక్సెస్ ను కూడా కట్టబెట్టింది. అయితే ఈ సినిమా పాన్ ఇండియాలో భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా లోకేష్ కనకరాజ్ పేరు ఒక్కసారిగా ఇండియా వైడ్ గా పాపులర్ అవ్వడానికి చాలా వరకు హెల్ప్ అయింది.
ఇక తమిళంలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న వాళ్లలో కమల్ హాసన్ ఒకరు…ఆయన కెరియర్ లో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేసినప్పటికి ఒకానొక సమయం లో ఆయనకి మొత్తం ప్లాప్ సినిమాలే వచ్చాయి…విక్రమ్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. అంతకుముందు వరుస సినిమాలతో డిజాస్టర్లను మూట గట్టుకుంటున్న సమయంలో విక్రమ్ సినిమాతో తనకు ఒక భారీ సక్సెస్ ని అందించి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకునేలా చేసిన దర్శకుడు లోకేష్ కనకరాజ్…ఈ సినిమా లోకేష్ కి, కమల్ హాసన్ కి చాలా ప్రత్యేకమైన సినిమా అనే చెప్పాలి. అయితే ఈ సినిమా గురించి ఎంత మాట్లాడకున్న తక్కువే అవుతుంది. ఇక లోకేష్ కనకరాజ్ ఈ సినిమాని నమ్మి దీని మీద దాదాపు రెండు సంవత్సరాల వరకు సమయాన్ని కేటాయించి స్టైలిష్ మేకింగ్ తో సినిమాని తీసి సూపర్ సక్సెస్ చేశాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా విషయంలో చాలా వరకు క్లారిటీని మెయింటేన్ చేస్తూ వచ్చిన లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం రజనీకాంత్ తో కూలీ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ‘విక్రమ్ 2’ సినిమాని స్టార్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే కమల్ హాసన్ కూడా ఈ సినిమా గురించి పలుమార్లు లోకేష్ తో చర్చలు కూడా జరిపినట్టుగా తెలుస్తోంది. మరి కూలీ సినిమా తర్వాత విక్రమ్ 2 సినిమాని పట్టాలెక్కించి భారీ విజయాన్ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో ప్రభాస్ నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఆయన క్యారెక్టర్ ఏంటి అనేది తెలియదు కానీ ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తే మాత్రం ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధిస్తుంది అనేది మన ఊహకు కూడ అందదనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ప్రభాస్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది. మరి అది విక్రమ్ 2 సినిమానేనా లేదంటే మరొక ఫ్రెష్ స్టోరీ తో సినిమా చెబుతున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇక కమల్ హాసన్ కి ప్రభాస్ కి మధ్య మంచి బాండింగ్ అయితే ఉంది.
ఎందుకంటే వీళ్ళిద్దరూ కల్కి సినిమాలో కలిసి నటించారు. ఇక ప్రభాస్ స్వతహాగా కమల్ హాసన్ అభిమాని కాబట్టి అతని కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నానంటూ ప్రభాస్ అప్పట్లో కొన్ని వాక్యాలు కూడా చేశాడు. మరి విక్రమ్ 2 సినిమాలో ప్రభాస్ కనిపిస్తే మాత్రం ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఇక ఐడెంటిటిని ఏర్పాటు చేసుకోవడం లో లోకేష్ మొదటి నుంచి సక్సెస్ అవుతూనే వస్తున్నాడు…